English | Telugu
కమాన్ గుసగుస అంటున్న అషు
Updated : Jul 7, 2022
అషు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ గా హీట్ పుట్టించే ఫొటోస్ పెట్టి సందడి చేస్తూ ఉంటుంది. ఈమె ఇప్పుడు యూఎస్ లో కొన్ని కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది. ఐతే తాను ఎన్ని ప్రోగ్రామ్స్ లో ఉన్నా కూడా సమయం తీసుకుని మరీ సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ షేర్ చేస్తూ ఆడియన్స్ కి టచ్ లో ఉండడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఐతే ఈసారి వెరైటీగా కొంచెం ట్రెండ్ చేంజ్ చేసింది. హాట్ ఫోటో సెషన్ కాకుండా "కమాన్ గుసగుస" అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చి వాటిని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. ప్రేమ మీద అషు అభిప్రాయాన్ని అడిగిన ఒక ఫాలోవర్ కి "ప్రేమ అనేది ఒక పరీక్ష లాంటిది ..పాస్ ఐనా ఫెయిల్ ఐనా తప్పక ఫేస్ చేయాల్సిందే" అంటూ రిప్లై ఇచ్చింది.
అలాగే ఇంకో ఫాలోవర్ " బిగ్ బాస్ హౌస్ లో మీరు శివ టామ్ అండ్ జెర్రీలా భలే ఫైట్ చేసుకునేవారు..ఆ బాండింగ్ చాలా బాగుంది" అని పోస్ట్ చేశారు. అలాగే అషుకి ఎక్స్ ప్రెస్ హరికి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు అనే విషయం కూడా తెలిసిందే. అన్ని షోస్ లో కూడా వీళ్ళిద్దరూ కలిసి పెర్ఫార్మ్ చేయడం చూస్తే ఇద్దరి మధ్య ఏదో ఉందని ఎవరికైనా అర్థమైపోతుంది. ఇదే ప్రశ్న ఒక ఫ్యాన్ అడిగేసరికి హరి తనకు మంచి ఫ్రెండ్ అంటూ కమాన్ గుసగుసలో చెప్పుకొచ్చింది.
రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియా సునామి సృష్టించేసింది. బిగ్ బాస్ బ్యూటీ గా, టీవీ సెలెబ్రిటీగా, అప్పుడప్పుడు స్కిన్ షోస్ తో, ఫోటో షూట్స్ తో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది అషు బేబీ..