English | Telugu

హైపర్ ఆది  : కావ్య కాలేజీలో నేను ఉండి ఉంటే 500 ల సార్లు నేనే ప్రపోజ్ చేసేవాడిని


బుల్లితెర మీద చాలా షోస్, ఈవెంట్స్ ప్రసారమవుతూ ఉంటాయి. వీటి షూటింగ్ టైమ్స్ లో ఆఫ్ స్క్రీన్ లో మంచి కామెడీ నడుస్తూ ఉంటుంది. అలాంటి ఒక షో రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా ప్రసారమయ్యింది. అదే న్యూ ఇయర్ దావత్ లొకేషన్ హోమ్ టూర్ షో. అందులో కావ్య, రీతూ చౌదరి, ఆది మధ్య మంచి కామెడీ జరిగింది. రీతూ చౌదరి వచ్చి "హాయ్ కావ్య..వాట్సాప్..ఎలా ఉన్నావ్" అని అడిగింది. "ఇలా ఉన్నా" అని కావ్య చెప్పేలోపు ఆది వచ్చేసాడు. "హాయ్ కావ్య..ఎలా ఉన్నావ్" అని అడిగాడు. " బాగున్నాను" అని చెప్పింది కావ్య. "ఆది నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పవు కానీ కావ్యను అడిగినప్పుడు మాత్రం వచ్చేస్తావ్" అంటూ రీతూ చౌదరి ఆది మీద అరిచింది. "కావ్య నచ్చని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరూ" అని ఆది కావ్య గురించి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసాడు. "నా లైఫ్ లో కావ్య అంత అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. సీరియస్ గానే చెప్తున్నా ఈ విషయం.

అందరికీ చెప్పేది బిస్కెట్..కానీ కావ్య విషయంలో చెప్పేది రియల్. ఇలా ఎలా ఇంత అందంగా పుట్టావ్. నీకు ఇప్పటి వరకు నీ లైఫ్ లో కాలేజ్ డేస్ లో ఎన్ని ప్రొపోజల్స్ వచ్చాయి." అని ఆది అడిగాడు. "నాలుగైదు వచ్చి ఉంటాయి " అంది కావ్య. "అరేయ్ ఇలాంటి అందమైన అమ్మాయికి కాలేజీలో నాలుగైదు ప్రొపోజల్స్ మాత్రమే వచ్చాయా ...ఒకవేళ ఆ కాలేజీలో నేను ఉంటే 400 ,500 ల సార్లు నేనే ప్రొపోజ్ చేసేవాడిని" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నెటిజన్స్ ఐతే క్రీమ్ బిస్కెట్, నిఖిల్ వింటే ఈ మాటలు ఇక ఆది పని అంతే" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.