English | Telugu

బూతులతో కంపు కొట్టించిన కమెడియన్స్!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం షో మొత్తం బూతులతో నిండిపోయింది. ఒకరికి మించి ఒకరు అన్నట్టుగా పోటీ పడి మరీ బూతులు తిట్టుకున్నారు. ఇక షోలో తోటికోడళ్ళ గొడవలు పేరుతో వీళ్ళు చేసిన అల్లరి, హంగామా అంతా ఇంతా లేదు. హైపర్ ఆది భార్యగా ఉమాదేవి, బులెట్ భాస్కర్ భార్యగా నటకుమారి ఈ ఎపిసోడ్ లో కనిపించారు. ఉమాదేవి వచ్చి ఎపిసోడ్ కి సంబంధించిన లింక్స్ చెప్తుండగా "అమ్మా నువ్వు సుమా అనుకుంటున్నావా... ఉమా నీకెందుకు అవన్నీ..లింక్స్ చెప్పడం ఒక ఆర్ట్ " అన్నారు ఆది, బులెట్ భాస్కర్.

"రాత్రి ఉరుములు, పిడుగులు.. అంటే అది నీ ఎఫెక్ట్ అన్నమాట" అని భాస్కర్ ఆదిని అనేసరికి "అంతలేదు మంచం మొత్తానికి అదే సరిపోయింది నేను కింద పడుకున్నా " అన్నాడు. "అసలు నువ్వు ఇరగ్గొట్టావా మంచాలు" అని నటకుమారి భాస్కర్ మీద ఫైర్ అయ్యేసరికి "చూసావా అదెప్పుడు నన్ను ఊరపంది అనదు..ఎందుకంటే చూడడానికి అదే అలా ఉంటుంది కాబట్టి" అన్నాడు ఉమాదేవి ఆది. "అది మిమ్మల్ని ఏమీ అనదు..ఊరకుక్కను కొట్టినట్టు కొడుతుంది తెలుసా" అని నటకుమారి కూడా ఉమను మరిన్ని బూతులు తిట్టింది. ఊరపంది, ఊరకుక్క అని ఇలా తిట్టిస్తున్నావేంట్రా అని ఫైర్ అయ్యాడు ఆది భాస్కర్ మీద.. "శ్రీనగర్ కాలనీ లో ఇలాగే కొట్టుకుంటాయి" అని లేడీస్ ఇద్దరినీ ఉద్దేశించి మరిన్ని బూతు డైలాగులు వేసాడు ఆది. ఇలా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంట్రడక్షన్ బూతుమయమయ్యింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.