English | Telugu

త్రినయనికి కొత్త కారుని బహుమతిగా ఇచ్చిన భర్త చేతన్

‘కథలో రాజకుమారి’ సీరియల్ పేరు చెప్తే చాలు ఆషిక గోపాల్ ప‌డుకోనే గుర్తొస్తుంది. ఆ సీరియల్ తో ఈమె బుల్లితెరపై మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. ఈ సీరియల్ కి అప్పట్లో మంచి రేటింగ్స్ వచ్చేవి. ఇక ఇప్పుడు 'త్రినయని' సీరియల్ లో నటిస్తోంది. ముందుగానే భవిష్యత్తు చూసి చెప్పే పాత్రలో కష్టాలు పడుతూ కనిపిస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు జీ తెలుగు టాప్ 5 సీరియల్స్ లో ఒకటిగా నిలించింది. బుల్లితెరతో సరిపెట్టుకోకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసే పిక్స్ కూడా పెడుతూ ఉంటుంది ఆషిక.

ఐతే ఇప్పుడు ఆషిక చాలా హ్యాపీగా ఉందట. దానికి కారణం వాళ్ళ హబ్బీ చేతన్ అని చెప్తోంది. లైఫ్ పార్టనర్ ఒక రోజు సడెన్గా ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే దాని ఆనందం మాటల్లో చెప్పలేనిది కదా అంటోంది. "అలాంటి ఆనందమే ఇప్పుడు నాది. నాకు చెప్పకుండా ఒక కార్ షోరూమ్ కి తీసుకెళ్లారు. అక్కడ ఒక కార్ లో టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్లాం" అని చెప్పింది.. ఇక ఫైనల్ గా తనకు య‌స్‌యువి (suv) కార్ కొని గిఫ్ట్ చేసారని చెప్పింది ఆషిక.

ఇప్పుడు భార్యాభర్తలు ఆ కారుకి పూజ చేయించి రైడ్ కి కూడా వెళ్లారట. "సాధారణంగా చేతన్ శెట్టి అన్ని నన్నే అడిగి ఏ పనైనా చేస్తాడు కానీ ఇప్పుడు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా సర్ప్రైజ్ చేసాడు" అంటూ మురిసిపోతోంది. ఆషిక, చేతన్ 2021 అక్టోబర్ లో వివాహం చేసుకున్నారు. చేతన్ బేసిగ్గా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఐనా సొంతంగా బిజినెస్ కూడా రన్ చేస్తుంటాడు.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.