English | Telugu

దేవయానికి వార్నింగ్ ఇచ్చిన రిషి

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'గుప్పెడంత మనసు' మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. మరి ఈ రోజు సీరియల్స్ హైలైట్స్ ఏంటో చూద్దాం. సాక్షి గురించి దేవయాని చెప్తుండేసరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి తినకుండా లేచి వెళ్ళిపోతాడు రిషి. తర్వాత మహేంద్ర కూడా తినకుండా వెళ్ళిపోతాడు. ఇలా జరిగినందుకు జగతి, మహేంద్ర ఇద్దరు కలిసి దేవయానిని బాగా తిడతారు.

ఇంకో వైపు తనకు లిఫ్ట్ ఇచ్చినందుకు రిషికి థాంక్స్ మెసేజ్ పెడుతుంది వ‌సు. అది చూసి వసు గురించి ఆలోచిస్తుంటారు రిషి. అక్కడ వసు కూడా రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపు ఇద్దరూ ప్రేమగా చాటింగ్ చేసుకుంటారు. రెండో రోజు రిషి దగ్గర "ఇంతకుముందులా నాతో ఫ్రీ గా మాట్లాడ్డం లేదు" అని వసు అడిగేసరికి పని ఉందని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతాడు రిషి. అప్పుడే మహేంద్ర, జగతి కాలేజీకి వస్తారు. ఆ తర్వాత రిషి.. వసు గురించి జగతికి చెప్తాడు.

"ఈ మధ్య అస్సలు తన జీవిత లక్ష్యం గురించి పట్టించుకోవడం లేదు, కాన్సన్ట్రేట్ చేయమని చెప్పండి" అంటూ వెళ్ళిపోతాడు. తర్వాత రిషి, వసు గురుంచి మహేంద్ర, జగతి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి ప్రాజెక్ట్ విషయమై వసు అక్కడికి వస్తుంది. ఆ విషయాన్నీ డైరెక్టుగా రిషితో మాట్లాడు అంటుంది. తర్వాత రిషికి వ‌సు కాఫీ ఇస్తుంది.. కానీ సడెన్‌గా ఆమెపై రిషి అరిచేస్తాడు. వసు ఫీల్ అయ్యి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరో వైపు దేవయాని అసలేం జరిగింది రిషికి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. రిషి, సాక్షిని కలిపి తన పెత్తనాన్ని కంటిన్యూ చేయాలని ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. ఇక మిగతా హైలైట్స్ కోసం సాయంత్రం ప్రసారమయ్యే 'గుప్పెడంత మనసు' సీరియల్ లో చూడొచ్చు.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.