English | Telugu

Honeymoon Photographer web series review: హనీమూన్ ఫోటోగ్రాఫర్ రివ్యూ

Honeymoon Photographer web series review: హనీమూన్ ఫోటోగ్రాఫర్ రివ్యూ

 

వెబ్ సిరీస్ : హనీమూన్ ఫోటోగ్రాఫర్
నటీనటులు: ఆశా నేగి, సాహిల్ సలాధియా, రాజీవ్ సిద్దార్థ, ఆపేక్ష పోర్వల్, రీతూ రాజ్ సింగ్, సంవేదన తదితరులు
సినిమాటోగ్రఫీ: సంతోష్ వసండి
మ్యూజిక్: శివమ్ సేన్ గుప్తా
నిర్మాతలు: రిషబ్ సేథ్
ఎడిటింగ్ , దర్శకత్వం: అర్జున్ శ్రీవాస్తవ
ఓటీటీ: జీ5

కథ: 

రోమేశ్ ఇరాని (రీతూ రాజ్ సింగ్) ఒక పెద్ద బిజినెస్ మెన్. అతని సంస్థలలో ఫార్మా కంపెనీ కూడా ఉంటుంది. ఆయన ఒక్కగానొక్క కొడుకు అధీర్ (సాహిల్ సలాథియా). అతను జోయా (ఆపేక్ష)తో ప్రేమలో పడతాడు. తండ్రికి ఇష్టం లేకపోయినా, ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. జోయాతో కలిసి మాల్దీవులకు హనీమూన్ ప్లాన్ చేస్తాడు. తమ వెడ్డింగ్ షూట్ కి వచ్చిన అంబిక (ఆశా నేగి)ని హనీమూన్ ఫొటోగ్రాఫర్ గా పిలుస్తారు. వాళ్లతో పాటు ఆమె మాల్దీవులకు వెళుతుంది. జోయాతో పెళ్లికి సంబంధించిన ఫోటోలను తీయడానికి వెళ్లినప్పుడే, అంబికపై అధీర్ మనసు పారేసుకుంటాడు. అతను జోయాతో సంతృప్తికరంగా లేడనే విషయం అంబికకి అర్థమవుతుంది. మాల్దీవులలో ఆమెకి రేహాన్ (రాజీవ్ సిద్ధార్థ) పరిచయమవుతాడు. అతనితో ఆమె చనువుగా ఉండటాన్ని అధీర్ తట్టుకోలేకపోతాడు. అంబికపై అధీర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే విషయం జోయాకి కూడా అర్థమైపోతుంది. ఒక రోజు తెల్లవారేసరికి బీచ్ లో అధీర్ శవమై కనిపిస్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. అధీర్ తల్లి మీనా పట్టుబట్టడంతో పోస్టుమార్టం చేయిస్తారు. అధీర్ రక్తంలో పాయిజన్ ఆనవాళ్లు ఉన్నట్టుగా తేలుతుంది. తమ కొడుకును ఎవరు హత్య చేశారనేది తనకి తెలియాలని రోమేశ్ ఇరాని పోలీస్ డిపార్టుమెంటుపై ఒత్తిడి తెస్తాడు. దాంతో ఏసీపీ దివ్య రంగంలోకి దిగుతుంది.‌ అధీర్ ను హత్య చేసింది ఎవరనేది తెలియాలంటే, రోమేశ్ వెదుకుతున్న పెన్ డ్రైవ్ తమకి దొరకాలని అంటుంది. ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది? అధీర్ హత్యకి కారకులు ఎవరనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఈ సిరీస్ మొత్తం చూసాక ఒక్కటే అనిపిస్తుంది.  ల్యాగ్ అండ్ స్లోకి కొత్త పేరేమో ఈ ' హానీమూన్ ఫోటోగ్రాఫర్' అనిపిస్తుంది. కథలో ఎంత బలమున్నా దానిని స్లోగా చూపిస్తే ఆడియన్ కి థ్రిల్ ఉండకపోగా నీరసం వస్తుంది. ఇందులోను అదే జరిగింది. సిరీస్ లో అధీర్ ఎప్పుడైతే చనిపోతాడో కథ ఆసక్తికరంగా మారుతుంది. కానీ దానిని చివరిదాకా కంటిన్యూ చేయలేకపోయారు మేకర్స్.

కథలో కొత్తదనం ఉంది.. కానీ ల్యాగ్ అండ్ స్లోగా సాగడంతో అది అంతగా ఇంపాక్ట్ అనిపించదు‌. అసలు కథలోకి వెళ్లడానికి సమయఙ ఎక్కువ తీసుకున్నాడు దర్శకుడు. ఇన్వెస్టిగేషన్ లో ట్విస్ట్ లు థ్రిల్ల్స్ ఉన్నప్పటికి దానినే చివరి వరకు కొనసాగించలేకపోయారు. ఒక రెండు సీన్లలో అడల్ట్ సీన్స్ ఉంటాయి. మిగతాదంతా పర్వాలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేలా తీసారు మేకర్స్. కానీ ఇది సిరీస్ లా కాకుండా సీరియల్ లా అనిపిస్తుంది. 

కథని సరిగ్గా ప్రెజెంట్ చేయాలంటే మూడు ఎపిసోడ్ లలో సరిపోతుంది కానీ దర్శకుడు ఆరు ఎపిసోడ్ ల వరకు సాగదీసాడు. ఇక ఇందులో ఇన్వెస్టిగేషన్ ఒక్కటి తప్పితే ఏదీ అంతగా సెట్ కాలేదు. కానీ ఇది బాగా ఖాళీగా ఉండేవారికి మంచి టైమ్ పాస్ అయ్యేలా ఉంటుంది కానీ కథ, లాజిక్స్ అడుగక్కూడదు. సిరీస్ మొదలయ్యాక స్కిప్ చేయకుండా ఉండే ఎపిసోడ్ ఏదీ ఉండదు. సంతోష్ వసండి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది. ఓకే మ్యూజిక్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

జోయా గా ఆపేక్ష, అధీర్ గా సాహిల్  సలాథియా, అంబికగా ఆశా నేగి ఆకట్టుకున్నారు. ఇక మిగతావారంతా వారి పాత్రల పరిధి మేరకి నటించారు. 

ఫైనల్ గా :  బాగా ఖాళీగా ఉంటే మాత్రమే చూడాలి. జస్ట్ వన్ టైమ్ వాచెబుల్ ఫర్ ఇన్వెస్టిగేషన్. 

రేటింగ్ :  2.25  / 5

✍️. దాసరి మల్లేశ్