English | Telugu

సొంత ఇంట్లోకి గృహప్రవేశం చేసిన హిమజ

ఒక వైపు బుల్లితెర మీద, మరో వైపు వెండితెర మీద హిమజ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి మిగతా కంటెస్టెంట్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. రకరకాల వీడియోస్ పోస్ట్ చేసి తన లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పుడూ తన ఫ్యాన్స్ కి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక గుడ్ న్యూస్ చెప్పింది హిమజ. సెలబ్రిటీస్ ఎవరైనా సరే కష్టపడి ఇల్లు, కారు, మొబైల్ ఇలా ఏవి కొనుకున్న వాటిని తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఇప్పుడు అలాగే హిమజ తన సొంత ఇంటి కలను నిజం చేసుకుని ఆ విషయాన్నీ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. పట్టు బట్టల్లో అందంగా ముస్తాబయ్యి దేవుడి పటం పట్టుకుని నవ్వులు చిందిస్తూ గృహప్రవేశం చేసి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. "కొత్త ఇల్లు అనేది జ్ఞాపకాలను అందిస్తుంది కలలు సాకారం చేసుకోవడానికి ఒక చక్కని ప్రాంతం కూడా. ఈ మైల్ స్టోన్ దాటినందుకు నాకు నేను అభినందనలు చెప్పుకుంటున్నాను" అంటూ ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. తాను కన్న కల నెరవేరేసరికి ఆరియానా గ్లోరీ, సిరి హన్మంత్, సన, అషూ రెడ్డి కంగ్రాట్యులేషన్స్.. గాడ్ బ్లెస్ యు అంటూ మెసేజెస్ చేశారు. నెటిజన్స్ కూడా హిమజకు విషెస్ చెప్పారు. "ఫైనల్లీ సాధించావ్.. సొంత ఇంటి కల అనేది ఎక్కువ అబ్బాయిలకు ఉంటుంది. కానీ నువ్వు దాన్ని సాధించి చూపించావ్..నెక్స్ట్ లెవెల్ అంతే..మీరు ఇలాగే ఎదగాలి అని అనుకుంటున్నా...మీ అఛీవ్మెంట్స్ చూసి సంతోషంగా ఉంది" అంటూ చెప్పారు.

ఇక ఈ ఏడాది సంక్రాంతి సమయంలో హిమజ ఒక కార్ కూడా కొనుక్కుంది. 40 నుంచి 50 ల‌క్ష‌లు ఖ‌రీదు చేసే కియా కార్నివాల్‌ కారును కొనుక్కుంది. ఆ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సీరియల్ నటిగా మొదలైన హిమజ కెరీర్ పర్లేదు అనిపించేలా సాగుతోంది. మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ ఎన్నో చేశారు. నేను శైలజ, జనతా గ్యారేజ్, స్పైడర్, శతమానం భవతి, వినయ విధేయ రామ వంటి మూవీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఐతే ఈమధ్య స్మాల్ స్క్రీన్ మీద కూడా కనిపించడం లేదు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.