Read more!

English | Telugu

ముకుందను ఓదార్చిన కృష్ణ, రేవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -180లో.. ఇన్ని రోజుల నుండి అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి ఎందుకు చెప్పలేదు.. సొంత కూతురిలాగా చూసుకున్నా కదా నన్ను మోసం చేసావంటూ కృష్ణని రేవతి అంటుంది. మురారి ముందు నువ్వు ప్రేమగా నటించినట్లు, నాతో ప్రేమగా నటించావా అని రేవతి అనగానే.. లేదు అత్తయ్య మీరంటే నాకు ప్రేమ ఉందని కృష్ణ అంటుంది. అయితే మీ అగ్రిమెంట్ పూర్తి కాగానే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? అలా వెళ్లిపోనని నాకు మాట ఇవ్వు కృష్ణ అని రేవతి అంటుంది. అయితే ఇదంతా కృష్ణతో అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి మాట్లాడినట్లుగా రేవతి ఉహించుకుంటుంది.

మరొకవైపు ముకుంద, మురారి లు ఇంకా ఇంటికి రాలేదని రేవతి ఆలోచిస్తుంటుంది. ఒకసారి కాకుండా ఒకసారి అయిన ఫోన్ చెయ్యాలి కదా అని రేవతి అనుకుంటుంది. అంతలోనే ముకుంద వస్తుంది. "ఏంటి ముకుంద చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావ్" అని రేవతి ముకుందని రేవతి అడుగుతుంది. అప్పుడు ముకుంద ఏడుస్తుంటుంది. ఏమైంది ముకుంద ఎందుకు ఏడుస్తున్నావని రేవతి అడుగుతుంది. మా అమ్మకి హెల్త్ బాగోలేదు. హాస్పిటల్ చుట్టూ తిరిగాం. ప్రొద్దున మురారి కంగారుగా వెళ్తుంటే నన్ను హాస్పిటల్ దగ్గర దింపమని చెప్పాను. తాను దింపి స్టేషన్ కి వెళ్ళాడని ముకుంద చెప్తుంది. మీ నాన్నకి ఫోన్ చేస్తే ఇంటికి రాలేదని చెప్పాడెందుకని రేవతి అనగానే.. నేను ఇంటికి వెళ్ళలేదు హాస్పిటల్ చుట్టూ తిరిగాను. నాన్న అందుకే అలా చెప్పారేమో అని ముకుంద అంటుంది. సరే నువ్వు టెన్షన్ పడకని రేవతి, కృష్ణ ఇద్దరు దైర్యం చెప్తారు. అప్పుడే మురారి ఇంటికి వస్తాడు. కృష్ణ మురారి దగ్గరికి వెళ్లి ప్రేమగా హగ్ చేసుకున్నట్లు ఉహించుకుంటుంది. మురారి రాగానే కృష్ణ చెప్పకుండా వెళ్లిపోయాడని అలిగి వెళ్ళిపోతుంది. మా సర్ కాల్ చేస్తే వెళ్ళాల్సి వచ్చింది.. సర్ అందరి ఫోన్ ట్రేసింగ్ లో ఉన్నాయి, స్విచాఫ్ చెయ్యమంటే చేసామని రేవతికి చెప్తాడు మురారి.

మరొకవైపు అలేఖ్య డ్రింక్ చేసి.. మురారిని ముకుంద ప్రేమిస్తుందని మధుతో చెప్తుంది. అవును నీకెలా తెలుసని మధు అడుగుతాడు. నాకు తెలుసని అలేఖ్య అంటుంది. మురారికి ముకుంద ప్రపోజ్ చేసేటప్పుడు నేను చూశానని మధు చెప్తాడు. అయినా ఏం  చేస్తాం పదా వెళదామంటూ అలేఖ్యని తీసుకెళ్తాడు మధు. మరొకవైపు మురారి చెప్పకుండా వెళ్లినందుకు కృష్ణ అలిగి బెట్టు చేస్తుంది. కృష్ణని మురారి సరదాగా ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.