English | Telugu
అమెరికాలో మమ్మల్ని మాములుగా ఏడ్పించలేదు!
Updated : Jun 26, 2023
హిమజ.. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చాలా సినిమాలలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలలో నటించిన హిమజ.. మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. విజయవాడలో పుట్టిన హిమజ.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో సినిమారంగంలోకి వచ్చింది. బిగ్ బాస్-3 లోకి ఒక కంటెస్టెంట్ గా వెళ్ళిన హిమజ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో తను ఒక సెలబ్రిటీగా మారిపోయింది.
హిమజ వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి సినిమాలకి మాటలు, పాటలు రాసేవాడు. అలా తను మాటలు, పాటలు రాసిన 'సర్వాంతర్యామి' అనే టెలీఫిల్మ్ లో తొలిసారి నటించింది హిమజ. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై అడపాదడపా సీరియల్స్ లో నటించిన హిమజ.. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నా నటించిన 'శివమ్' చిత్రంలో హీరోయిన్ కి స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా వెండితెరకు కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ, చందమామ రావే, జనతా గ్యారేజ్, ధృవ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలలో చేసింది.
హిమజ తన ఇన్ స్టాగ్రామ్ లో గత కొంత కాలంగా సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. అదేవిధంగా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ రెగ్యులర్ గా చేస్తూ పాపులారిటీని పెంచుకుంటూ వస్తోంది. కాగా తను తాజాగా 'అమెరికాలో మమ్నల్ని మాములుగా ఏడ్పించలేదు' అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది హిమజ. అందులో చాలా విషయాలను షేర్ చేసుకుంది. అమెరికాలో ఒక ఈవెంట్ కి వెళ్ళిన హిమజ, అవినాష్, సావిత్రి, జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్, సోహెల్, రోహిణి అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. హిమజ తన వ్లాగ్ లో ఎవరు ఎలా ఉన్నారో చూపిస్తూ వాళ్ళ సరదా మాటలని వ్లాగ్ లో పెట్టింది.కాగా అమెరికాలో వాళ్ళంతా తిరగాలని ప్లాన్స్ వేసుకొని మరీ వచ్చారని హిమజ చెప్పింది. మాటల మధ్యలో సోహెల్ కి ఒక అవకాశం వచ్చిందని హిమజ చెప్పగా.. తనని ఇన్వాల్వ్ చేయొద్దని సోహెల్ అడ్డుకున్నాడు. ఇలా వాళ్ళు అమెరికాలో చాలా ప్లాన్స్ వేసినట్డుగా చెప్పుకొచ్చింది హిమజ.