English | Telugu
నిరుపమ్ - శౌర్యల పెళ్లి ప్రయత్నాల్లో హిమ!
Updated : Jul 8, 2022
స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం' సీరియల్ శుక్రవారం ఎలాంటి మలుపులు తిరగనుందో ఒకసారి చూద్దాం. ఇంట్లో జ్వాల ఏడుస్తూ వుంటే చంద్రమ్మ తనని ఓదారుస్తూ వుంటుంది. ఏడవకు జ్వాలమ్మ అని చెప్పి, ఇంద్రుడిని బయటి నుంచి భోజనం తీసుకురమ్మంటుంది. మరో వైపు ఇంటికి వెళ్తున్న సౌందర్య, ఆనందరావు, హిమలు జ్వాల మాటలు గుర్తు చేసుకుని బాధపడుతూ వుంటారు.
ఆనందరావు వెళ్లి జ్వాలని "ఇంటికి వెళదాం బంగారం" అంటాడు. "మీ నానమ్మ ఎదురుచూస్తుంది. ఎన్నో జ్ఞాపకాలు ఎదురుచూస్తున్నాయి" అని చెబుతాడు. "అయితే నా శత్రువు కూడా ఎదురుచూస్తోంది. నేను రాను తాతయ్యా" అంటుంది. "ఈ వయసులో మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తావ్ అమ్మా" అని ఆనందరావు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా జ్వాల వినకుండా ఆనందరావుని తిరిగి ఇంటికి పంపించేస్తుంది. ఇంటికి వెళ్లిన ఆనందరావు బాధపడుతూ "ఇక శౌర్య ఇంటికి రాదేమో" అని అంటాడు.
హిమ మాత్రం నిరుపమ్ బావతో శౌర్య పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతుంది. కానీ శౌర్యలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించదు. కట్ చేస్తే.. శౌర్య బయటికి వెళ్లి ఇంటికి వస్తుంది. తలుపులు తెరిచే వుండటాన్ని గమనించి ఎవరు తెరిచారని లోపలికి వెళ్లేసరికి హిమ వంకాయలు కోస్తూ కనిపిస్తుంది. "ఏం చేస్తున్నావే?" అని శౌర్య అడిగితే.. వంట చేస్తున్న శౌర్య "ఎంతైనా వంటలక్క కూతుళ్లం కదా?" అంటుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన శౌర్య.. హిమ చేతిలో వున్న వంకాయలని విసిరికొడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.