English | Telugu

జాకీ చనిపోయాడు అంటూ రూమర్స్...కన్నీళ్లు పెట్టుకున్న హరిత!

సుమ అడ్డా షో ఈ వారం ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ షోకి జాకీ-హరిత, సాయికిరణ్-అర్చన అనంత్ వచ్చారు. "మీకు బాగా కోపం వస్తే ఏం చేస్తారు" అని అడిగింది సుమ.."బుగ్గలు కొరికేస్తుంది" అన్నాడు జాకీ "హా కొరకనిస్తారా ఏమిటి" అని ఫన్నీగా హరిత అనేసరికి "కొరికితే మీలా ఐపోయేవి" అని జాకీ సుమకి రివర్స్ కౌంటర్ వేసాడు. "మరి కోపం వచ్చినప్పుడు మీరేం చేస్తారు" అని అర్చన అనంత్ ని సుమ అడిగేసరికి "నీళ్లు తాగుతాను" అని చెప్పింది. "కొంతమందైతే కోపం వస్తే నీళ్ళల్లో ఏమన్నా కలుపుకుని తాగుతారు" అని చెప్పి నవ్వించింది సుమ. "ఎందుకు అంత దీనంగా చూస్తున్నారు ఆవిడని" అని జాకీని అడిగేసరికి "నాకేమన్నా ప్రాబ్లమ్ వస్తే ఆవిడని చూస్తాను..ఎందుకంటే పెద్ద ప్రాబ్లమ్ ఆమె కదా" అన్నాడు జాకీ. తర్వాత లెక్కల టాస్క్ ఇచ్చింది అందులో సాయికిరణ్ సరిగా ఆన్సర్ చెప్పలేదు.."అందుకే మా మేడం అన్నారు చిన్నప్పుడు..లెక్కలు నేర్చుకోమని" అన్నాడు సాయికిరణ్ ఫన్నీగా.. ఇక సుమ, హరిత, జాకీ ముగ్గురూ కలిసి "శుభలగ్నం" మూవీ స్పూఫ్ చేశారు.

"ఈయన్నేన మీరు అమ్మాలనుకుంటున్నది..సరే ఆయన టాలెంట్స్ ని చెప్పండి" అని సుమ అడిగేసరికి..బాగా వండి పెడతారు, బాగా తినిపిస్తారు అని ఎలా చెప్తాము"అంది హరిత."హనీ మూన్ కి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు" అని హరితను సుమ అడిగింది. "మా ఆయన కనీసం ఆగ్రా అన్నా చూపిస్తారు అనుకున్నా కానీ చార్మినార్ దగ్గరకు తీసుకొచ్చి గాజులు కొనిపించారు" అని చెప్పింది. ఐకే ఈ ఎపిసోడ్ ప్రోమో ఫైనల్ లో కొంతకాలం క్రితం "జాకీని కాలుస్తున్నారు..జాకీ చనిపోయాడు " అనే రూమర్స్ బాగా వినిపించాయి అని చెప్పేసరికి హరిత స్టేజి మీదే కన్నీళ్లు పెట్టేసుకుంది. జాకీ చెప్పిన మాటలకు అందరూ షాకైపోయారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.