English | Telugu

ట్రెండింగ్ లో హరిత జాకీ కొత్త వ్లాగ్ !

చెన్నై లో పుట్టి పెరిగిన హరిత.. తన పదిహేనవ ఏటనే సినిమాలలో నటించింది. అయితే తనకి సీరియల్స్ తో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. అగస్ట్ 14, 2001లో హరిత జాకీని పెళ్ళి చేసుకుంది. వాళ్ళిద్దరు దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలలో కలిసి నటించేవారు. ఆ తర్వాత ఈటీవిలో ప్రసారమైన 'సంఘర్షణ' సీరియల్ లో తొలిసారి తన భర్త జాకీతో‌ కలిసి నటించింది. అప్పటి నుండి చాలా సీరియల్స్ లలో ఇద్దరు కలిసి నటించారు. అయితే జీ తెలుగులో ప్రసారమైన 'కలవారి కోడళ్ళు' సీరియల్ లో తను చేసిన నటనకి గాను అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ టాప్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ గా ఉంది. అయితే జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'ముద్ద మందారం' లో తనకి ప్రశంసలు దక్కాయి.

హరిత అండ్ జాకీ ఇద్దరు కలిసి రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే హరిత తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ లుగా చేస్తూ అప్లోడ్ చేస్తుంటుంది. తన కొత్త సీరియల్ కోసం తీసుకున్న శారీస్ అని ఒక‌ వ్లాగ్, వాళ్ళ అమ్మ బర్త్ డే కోసం తీసుకున్మ బంగారం అంటూ ఒక వ్లాగ్, షూటింగ్ నుండి వచ్చాక ఇది నా పరిస్థితి అంటూ మరొక వ్లాగ్ చేయగా అన్నింటికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 'మా అబ్బాయితో ఒక రోజు' అంటూ వాళ్ళ కొడుకిని పరిచయం చేసిన హరిత జాకీ, ఆ తర్వాత బాలింతల కోసం 'బాలింతలకు భళే కూర' అనే వ్లాగ్ చేసి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు తాజాగా 'వరలక్ష్మి వ్రతం.. తాంబూలం.. పేరంటం' పేరిట వ్లాగ్ ని చేసింది. వరలక్ష్మి వ్రతం చేసిన హరిత.. ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకుంది. విష్ణుప్రియ, శ్రీవాణి, ఇలా అందరు సీరియల్ యాక్టర్స్ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకొని వారికి తన ఆశీర్వాదం ఇచ్చి వచ్చింది హరిత. కాగా ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. పద్మావతి కళ్యాణం సీరియల్ అభిమానులు హరిత జాకీ నటనకి, ఆమె సింప్లిసిటీని విశేషంగా ఆరాధిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు యూట్యూబ్ లో తన ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వ్లాగ్ కి కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.