English | Telugu

హన్సిక లవ్ షాది డ్రామా నాల్గవ ఎపిసోడ్!

హన్సిక సోహెల్ ల పెళ్ళికి సంబంధించిన అన్ని విషయాలతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రతీ శుక్రవారం ఒక కొత్త ఎపిసోడ్ తో 'హన్సిక లవ్ షాది డ్రామా' సిరీస్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే తాజాగా రిలీజ్ అయిన ఎపిసోడ్ లో.. హన్సిక పెళ్ళిలో హార్స్ పోల్ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేస్తారు హన్సిక మేనేజర్ అండ్ సోహెల్ మేనేజర్. వాటికోసం చాలా ప్రయత్నిస్తుంటారు. హార్స్ పోల్ లో ఆడటానికి గుర్రాలు లేవని, ప్లేయర్స్ రేస్ కోసం వెళ్ళారు.. ఇప్పుడు సీజన్ నడుస్తుందని వాళ్ళు చెప్పడంతో.. హన్సిక మేనేజర్ ఏం చెయ్యలేకపోతాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా అక్కడ వారు ఒప్పుకోరు. శ్రీయా హన్సిక క్లోజ్ ఫ్రెండ్.. హన్సిక లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని సోహెల్ చెప్పాడు. శ్రీయా పెళ్ళికి రావడానికి వీలు కాదు అని వీడియో కాల్ చేసి చెప్పడంతో కాల్ కట్ చేస్తుంది హన్సిక. ఆ తర్వాత హన్సిక పెళ్ళిరోజు ధరించే డ్రెస్ కోసం ఢిల్లీలోని ఒక ఫేమస్ డిజైనర్ షాప్ లో చేయిస్తుంటారు. అవి చాలా ఖరీదైనవి. ఆ తర్వాత తన అసిస్టెంట్ భావన దగ్గరికి వెళ్తాడు సోహెల్. పెళ్ళికి ముందు తనతో ఒక డ్యాన్స్ చేస్తానని చెప్పగా.. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన పాట ఒకటి ఉంది అని భావన చెప్తుంది. దానికి సోహెల్ షాక్ అవుతాడు.

హార్స్ పోలో వీలుకాకుంటే మనకు ఉన్న సెకండ్ ఆప్షన్ క్యామెల్ పోలో అని సోహెల్ మేనేజర్ తో రాజస్థాన్ లోని ఈవెంట్ మేనేజర్ చెప్తాడు. దానికి అతను సరైనదే కానీ హన్సిక, సోహెల్ దీనికి ఒప్పుకుంటారా అని చెప్పి వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. హన్సిక వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. "మీకు ఆ రోజే చెప్పాం కదా.. హన్సిక ఒక్కసారి చెప్పిందంటే అది ఫైనల్ దీనిలో ఏ మార్పు లేదు. హార్స్ పోల్ ఉండాల్సిందే.. మీరు గుర్రాలని ఢిల్లీ నుండి అయినా అర్జెంటినా నుండి అయినా తీసుకురండి" అని హన్సిక మేనేజర్ దిగ్విజయ్ తో మాట్లాడుతుంది హన్సిక అమ్మ.

ఆ తర్వాత పెళ్ళి కోసం తన బట్టలను ప్యాక్ చేసుకుని హన్సిక వెళ్తుంటే వాళ్ళ అమ్మ "ఎందుకమ్మ ఇన్ని బట్టలు.. కొన్ని తీసుకెళ్ళు" అని చెప్పగా.. నాకు తెలుసమ్మా అని హన్సిక అంటుంది. పెళ్ళి అయ్యాక మా అమ్మని వదిలిపెట్టి వెళ్ళాలంటే, అన్నయ్యతో గొడవపడకుండా ఉండాలనే ఆలోచనే నన్ను బాధపెడుతుందని హన్సిక చెప్పింది. అలా చెప్తూ ఏడ్చేసింది హన్సిక. ఆ తర్వాత రాజస్థాన్ లోని ముందోట ఫోర్ట్ అండ్ ప్యాలెస్ కి వెళ్ళారు. అక్కడ పెళ్ళి కోసం చేసిన ఏర్పాట్లను అందరూ ఆసక్తికరంగా చూసారు. ఈ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.