English | Telugu
నటరాజ్ మాస్టర్ తో, యాదమ్మ రాజుతో డాన్స్ చేసిన రాధా, సదా
Updated : Jun 26, 2023
"నీతోనే డాన్స్" షో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఇరగదీస్తున్నారు కంటెస్టెంట్స్. ఈ వారం "ధూమ్ ధామ్ " టీంలోని నాలుగు జోడీలు అద్దిరిపోయే డాన్సులు చేసి జడ్జెస్ ని మెప్పించేసారు. జడ్జెస్ కూడా కంటెస్టెంట్స్ తో స్టేజి షేర్ చేసుకున్నారు. రావడంరావడమే మంచి కలర్ ఫుల్ డ్రెస్సెస్ లో వచ్చారు . లాస్ట్ వీక్ చూసుకుంటే గోల్డెన్ సోఫాలో కూర్చునే ఛాన్స్ ని కావ్య, నిఖిల్ పొందారు. ఇక ఈ వారం ఆ ఛాన్స్ ని అందుకున్నారు నటరాజ్ మాస్టర్-నీతూ జోడి. లాస్ట్ వీక్ నటరాజ్ మాస్టర్ డల్ గా అస్సలు సరిగా పెర్ఫార్మ్ చేయలేదు. కానీ ఈ వారం మాత్రం ధూమ్ ధామ్ గా డాన్స్ చేసేసారు.
నటరాజ్ మాస్టర్ - నీతూ కలిసి స్టేట్ రౌడీ మూవీ నుంచి "1234 డాన్స్ డాన్స్ " అనే సాంగ్ ని అప్పట్లో చిరంజీవి, రాధా వేసుకున్నట్టుగానే కాస్ట్యూమ్స్ వేసుకుని చేశారు. ఇక జడ్జి రాధా ఆ సాంగ్ వస్తున్నంత సేపు కూడా ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి ఆ స్టెప్స్ వేస్తూ కనిపించారు. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్స్ పూర్తయ్యాక ఇదే సాంగ్ కి రాధ నటరాజ్ మాస్టర్ తో కలిసి డాన్స్ చేశారు. ఇక చివర్లో స్టెల్లా-యాదమ్మ రాజు చేసిన "ప్రియతమా తెలుసునా" సాంగ్ పెర్ఫార్మెన్స్ అద్దిరిపోయింది. ఇక ఈ పెర్ఫార్మెన్స్ చూసేసరికి సదా యాదమ్మ రాజుతో కలిసి స్టెప్స్ వేసింది. ఇలా ఈ వారం ఇద్దరు లేడీ జడ్జెస్ కంటెస్టెంట్స్ తో కలిసి డాన్స్ చేసి ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ నాలుగు జోడీల్లో టాప్ లో నిఖిల్- కావ్య ఉండగా, లీస్ట్ లో యాదమ్మ రాజు - స్టెల్లా ఉన్నారు. నటరాజ్ మాస్టర్ కి, పవన్ కి మధ్యన ఏవో క్లాషెస్ ఉన్నాయని..అవన్నీ మర్చిపోయి ఇక నుంచి ఫ్రెండ్స్ గా ఉండాలని చెప్పింది శ్రీముఖి. దాంతో నటరాజ్ మాస్టర్ వైఫ్ నీతూ, పవన్ వైఫ్ అంజలి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈవారం నటరాజ్ మాస్టర్ చేసిన డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. దాంతో పవన్ - అంజలి జంట వెళ్లి వాళ్ళని హగ్ చేసుకుని విషెస్ చెప్పారు. ఇలాగే తమ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ కంటిన్యూ కావాలని కోరుకున్నారు.