English | Telugu

Guppedantha Manasu Serial Saroja (Vinitha) : గుప్పెడంత మనసు రిషి మరదలు సరోజ షాకింగ్ కామెంట్స్!

గుప్పెడంత మనసు సీరియల్ కి తెలుగు టీవీ కార్యక్రమాల్లోనే అత్తధిక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పటికే క్లైమాక్స్ ఎపిసోడ్ పూర్తయిందని దర్శకుడు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలని కూడా షేర్ చేశాడు. ఇక తాజాగా జ్యోతిరాయ్, రిషి వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. వీరితో పాటుగా కొత్త క్యారెక్టర్ సరోజ కూడా బాగా పాపులర్ అయింది.

రిషికి మరదలుగా సరోజ పాత్రలో రాణిస్తుంది వినీత. ఈమె మన తెలుగు అమ్మాయే. పక్కా హైదరాబాదీ. ఇక్కటే పుట్టి పెరిగింది. బీటెక్ వరకు చదివిన వినీత.. 2020 కోవిడ్ బ్యాచ్‌లో బీటెక్ పూర్తి చేసింది. సీరియల్స్‌లోకి రాకముందు తమడా మీడియాలో పనిచేసింది. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్‌లో కూడా నటించింది. సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నించిన వినీత.. వెండితెరపై అవకాశం రాలేదు కానీ.. బుల్లితెరపై రాణిస్తోంది. అనేక సీరియల్స్‌లో నటించింది వినీత.

మొదట్లో ఈవీటీలో అను-పల్లవి సీరియల్‌లో నటించిన వినీత.. జీ తెలుగులో ‘దేవతలారా దీవించండి’, ‘ఊహలు గుసగుసలాడే’ సీరియల్స్‌లో నటించింది. వీటితో పాటు.. పలు టీవీ షోస్‌లోనూ కనిపించింది. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ పంచ్‌లు పేల్చింది వినీత. దేవతలారా దీవించండి సీరియల్‌లో నెగిటివ్ రోల్‌ పోషించి.. నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత ఊహలు గుసగుసలాడే సీరియల్‌లోనూ మెప్పించింది వినీత. కాగా ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. రాకేష్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్‌లో రంగా (రిషి) మరదలిగా చేస్తోంది. చూడ్డానికి కుందనపు బొమ్మలా, తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అందానికి తగ్గ అభినయం అన్నట్టుగానే రంగా మరదలిగా నటనతోనూ మెప్పిస్తోంది వినీత.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వినీత మాట్లాడుతూ.. తను చాలా తక్కువ రోజులే షూటింగ్ లో ఉన్నానని, ఇంత తొందరగా ముగుస్తుందని ఊహించలేదని అంది. రిషి, వసుధారలు షూటింగ్ కి వెళ్లిన మొదటిరోజే కలిసిపోయారని, వాళ్ళిద్దరు డౌన్ టూ ఎర్త్ అని చాలా బాగా మాట్లాడతారని, ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయారంటు వినీత చెప్పుకొచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.