English | Telugu
Guppedantha Manasu Climax : గుప్పెడంత మనసు సీరియల్ కి క్లైమాక్స్ ఇదా...
Updated : Aug 26, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఒక్కో ఎపిసోడ్ లో ఉన్న ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తూ దర్శకుడు క్లైమాక్స్ కి చేరుస్తున్నాడు.
అసలు అటో ట్రైవర్ గా రంగా పాత్రలో రీఎంట్రీ ఇచ్చిన రిషి గతమేంటని సింపుల్ గా తేల్చేశాడు దర్శకుడు. రంగానే రిషి అని నమ్మిన వసుధార అతన్ని వెతుక్కుంటూ వెళ్లింది. అక్కడికి వెళ్ళాక రంగానే రిషి అని బలంగా నమ్మింది. చివరికి అదే నిజం అయ్యింది కూడా. కానీ.. శనివారం నాటి ఎపిసోడ్‌లో రంగాగా రిషి ఎందుకు నటించాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. అసలు రంగాని రంగంలోకి దింపారు. రంగా వేరు.. రిషి వేరు అనే వివరణ ఇచ్చారు కానీ.. అసలు అందులో లాజిక్కే లేదు. ఏదో శుభం కార్డ్ వెయ్యాలి కాబట్టి హడావిడిగా క్లైమాక్స్‌లో కథని కన్ఫూజన్ గా చేసేశారు. మరోవైపు మను తండ్రి ఎవరు అనే ప్రశ్నకి సింపుల్ గా శైలేంద్రతో చెప్పించేశాడు.
రంగాని వెతుక్కుంటూ వసుధార అతని ఊరు వెళ్లినప్పుడు.. అతనికి ఒక ఫ్యామిలీ ఉంది.. నాన్నమ్మ ఉంది.. అక్కడే చదువుకున్నాడు.. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు.. చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నాడంటు వసుధారకి చెప్పించారు. టీ కొట్టోడు దగ్గర నుంచి కాలేజ్ ప్రిన్సిపల్ కూడా రంగా గొప్పతనాన్ని చాటారు. రంగా ఆ ఊరిలోనే పుట్టిపెరిగినట్టుగా చూపించారు. వసుధార కూడా అనేక సందర్భాల్లో రంగా గురించి ఆ ఊరిలో అడిగినప్పుడు.. రంగా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు అని చెప్పారు. ఇక సరోజ కూడా.. చిన్నప్పటి నుంచి బావపై ఆశలు పెట్టుకున్నగా చూపించారు. అతనికి మామయ్య కూడా ఉన్నాడు. పైగా తన తండ్రి చేసిన అప్పుల్ని రంగాని తీరుస్తున్నట్టుగా చూపించారు. రంగా చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని చెప్పేశారు.
నా నాన్నమ్మ కోసం ఫ్యామిలీ కోసం తిరిగి వస్తుండగా.. ప్రమాదంలో ఉన్న రిషిని కాపాడతాడని.. ఆ ప్రయత్నంలోనే అతను కోమాలోకి పోయాడని.. ఆ ప్రమాదానికి కారణం తానే కావడంతో రిషి.. రంగాగా ఆ ఊరికి వెళ్లాడని సింపుల్‌గా తేల్చేశారు. చాలా ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయినా మనవడ్ని.. నాన్నమ్మ గుర్తుపట్డదా? మరదలు సరోజ ఎలా నమ్మేసింది? బుజ్జిగాడు అన్నా అన్నా అని ఎలా పిలుస్తున్నాడు? అసలు ఊరంతా అతన్ని రంగాగా ఎలా నమ్మారు? చిన్నప్పుడే ఊరు వదిలి వెళ్లినోడ్ని.. ఆ ఊరి జనం ఎలా గుర్తుపట్టాడు? ఆ ఊరితో రంగా అనుబంధం ఎలా ఏర్పరుచుకున్నాడు.. ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. మరి ఈ ప్రశ్నలన్నింటికి దర్శకుడు ఏ విధమైన ముగింపు ఇస్తాడో చూడాలి మరి.