English | Telugu
Guppedantha Manasu : అమ్మ ఎవరని అనుపమని నిలదీసిన మను!
Updated : Aug 28, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'( Guppedantha Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1164 లో.....మా మావయ్యపై ఎందుకు ఎటాక్ చేశారని మనుని వసుధార అడుగుతుంది. నేనెందుకు చేస్తాను.. ఆ అవసరం నాకేంటని మను అంటాడు. మీరు శైలేంద్ర ద్వారా నిజం తెలుసుకున్నారని నాకు తెలుసని వసుధార అంటుంది.
మావయ్య మీ కన్నతండ్రి అని నిజం తెలుసుకున్నారు అందుకే తనపై ఎటాక్ చేశారని వసుధార అంటుంది. నేను చెయ్యలేదని మను అంటాడు. మావయ్యపై కోపం పక్కన పెట్టి మీ మీ కన్నతల్లి ఎవరో తెలుసుకోండి. మీ కన్న తల్లి అనుపమ గారు కాదు.. మీ తల్లి గురించి ఆవిడకే తెలుసని వసుధార అంటుంది. మీరు అంటుంది ఏంటి? అనుపమ గారే నా కన్నతల్లి అని మను అంటాడు. ఇంకొకటి ఏంటంటే మహేంద్ర సర్ పై నేను ఎటాక్ చెయ్యలేదు అని క్లారిటీ ఇచ్చి మను వెళ్తాడు. ఆ తర్వాత దేవయానితో నేనే బాబాయ్ పై ఎటాక్ చేయించానని శైలేంద్ర చెప్పగానే.. అసలు ఎందుకు నాకు చెప్పకుండా చేస్తున్నావని దేవయాని కోప్పడుతుంది. బాబాయ్ ని వసుధారని ఆ తర్వాత ఆ రంగాగాన్ని వేసేసి ఎండీ అవ్వాలని అనుకున్నానని శైలంద్ర అంటాడు. ఆ తర్వాత ఫణీంద్ర వచ్చి మహేంద్ర పై ఎవరు ఎటాక్ చేసారో ఇకనుండి వాడిని కనిపెట్టే పనిలో ఉంటానని ఫణీంద్ర అనగానే దేవయాని, శైలేంద్రలు టెన్షన్ పడతారు. ఆ తర్వాత మను కోపంగా ఇంటికి వచ్చి.. అసలు నా కన్నతల్లి ఎవరు అంటూ అనుపమని నిలదీస్తాడు. అనుపమ మాత్రం సైలెంట్ గా ఉంటుంది.
మరొకవైపు ఎటాక్ చేసింది ఎవరో కనిపెడుతానంటూ వెళ్ళావ్.. ఏమైందని రిషి అడుగుతాడు. మను గారు అనుకున్న కానీ తను కాదంట అని వసుధార అంటుంది. ఎవరు చేసారో నాకు తెలుసు మా అన్నయ్య అని రిషి అంటాడు. అంత తెలిసి మౌనంగా ఉంటున్నారని వసుధార అంటుంది. తప్పు చేసిన వాళ్ళను వదిలి పెట్టనని రిషి అంటాడు. అప్పడే రాధమ్మని తీసుకొని సరోజ వస్తుంది. రంగా ఎలా ఉన్నావ్ మన ఇంటికి వెళదామని అంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి.. రంగా ఏంటి? అతను నా కొడుకు రిషి అని అంటాడు. నువ్వు రంగా అని చెప్పురా అని రాధమ్మ అంటుంది. నేను రంగా కాదు.. రిషి.. ఆయన కొడుకుని.. వసుధార భార్యని అని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.