English | Telugu
Krishna Mukunda Murari:రెండు రోజుల్లో పెళ్ళి.. నిజం నిరూపించి వాళ్ళు తప్పించుకోగలరా?
Updated : Jan 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -358 లో.. కృష్ణ, మురారి ఒక దగ్గర ఉండి కేసు గురించి డిస్కషన్ చేస్తారు. ఈ పెళ్లి ఖచ్చితంగా జరపాలని అనుకుంటుంది పెద్ద అత్తయ్య ఒక్కతే కదా.. ఇంకా ఎవరు అనుకుంటున్నారని మురారితో కృష్ణ అంటుంది. ఒకవేళ కొత్తగా వచ్చిన దేవ్ ఇదంతా చేస్తున్నాడని అంటారా అని కృష్ణ అనగానే.. అతనికి అంత అవసరం లేదని మురారి అంటాడు.
ఆ తర్వాత వీలు అయినంత త్వరగా అ రింగ్ అతన్ని పట్టుకోవాలని కృష్ణ అంటుంది. మరొకవైపు ముకుంద టెన్షన్ పడుతుంటే.. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్? మీ ఫ్రెండ్స్ ని కూడా పెళ్లికి పిలువు అని భవాని అనగానే.. ఒకవేళ పెళ్లి ఆగిపోతే మీ పరువు పోతుంది కదా అత్తయ్య అని ముకుంద అనగానే... భవాని తనపై కోప్పడుతుంది. ఏమి చెయ్యలి అత్తయ్య ఇదంతా చుస్తే అలాగే అనిపిస్తుంది. పెళ్లి చేసుకోవాల్సిన వాడు కన్నెత్తి కూడా చూడడం లేదు. పెళ్లిలో ఎక్కడికి అయిన పారిపోతే నా పరిస్థితి ఏంటని ముకుంద అంటుంది. అప్పుడే రేవతి వచ్చి.. అంత మురారిని అర్థం చేసుకున్నప్పుడు పెళ్లికి ఎందుకు సిద్ధపడ్డావని అంటుంది. కృష్ణ ,మురారి ఇద్దరు పెళ్లికి సిద్ధం అయ్యే చేసుకున్నారా అని భవాని అడుగుతుంది. అంటే ఇప్పుడు బానే ఉంటున్నారు కదా అని రేవతి అంటుంది. వాళ్ళు కూడా కొన్ని రోజులకు బానే ఉంటారని భవాని అంటుంది. అప్పుడే ప్రసాద్, సుమలత వస్తారు. నలుగు పెట్టడానికి కావాలసినవి తీసుకొని వచ్చారా అని భవాని అడుగుతుంది. రెండు రోజుల్లో పెళ్లి కాబట్టి మురారి ముకుందలకి రేపు నలుగు పెట్టాలని భవాని చెప్తుంది. దాంతో ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు శకుంతల బ్యాగ్ సర్దుతుంటే అప్పుడే నందు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. కృష్ణ, మురారీలని కూడా తీసుకొని వెళ్తున్నానని శకుంతల అనగానే.. ఆ విషయం నందు వెళ్లి రేవతికి చెప్తుంది. రేవతికి నందు చెప్తున్నప్పుడు భవాని వింటుంది. ఆ తర్వాత రేవతిని నందు తీసుకొని శకుంతల దగ్గరకి వెళ్తుంది. శకుంతల బ్యాగ్ తో రెడీగా ఉంటుంది. అప్పుడే కృష్ణ, మురారి రేవతి, నందు తన దగ్గరకి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే.. వెళదాం పదా అని శకుంతల అంటుంది. ఇప్పుడు వెళ్తే తప్పు చేసే వెళ్లిపోయారని అంటారు. ఈ పెళ్లి ఏమి జరగదని శకుంతలకి కృష్ణ, మురారి నచ్చజెప్పుతారు.వాళ్ళ మాటలు అన్ని పై నుండి భవాని వింటుంది. మరొకవైపు ముకుంద, దేవ్ లు పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే సుమలత వాళ్ళ దగ్గరకి వచ్చి మాట్లాడుతుంది. అదే సమయంలో పెళ్లికి కావలసిన లిస్ట్ రాస్తున్న సుమలత, ప్రసాద్ దగ్గరకి కృష్ణ, మురారి ఇద్దరు వస్తారు. ఎలాగూ ఈ పెళ్లి జరగదు.. మేమ్ నిరూపిస్తామని కృష్ణ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటే ఆ మాటలు భవాని వింటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.