English | Telugu
రేవతికి మిషన్ ఉందని అబద్ధం చెప్పిన కృష్ణ, మురారి!
Updated : Jul 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌లో-199 లో.. కృష్ణ, మురారి ఇద్దరు కలిసి ఫామ్ హౌజ్ నుండి ఇంటికి బయల్దేరగా వారికన్నా ముందుగా ముకుంద ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఇంట్లోకి రాగానే మధు, అతని భార్య ఎదురుపడతారు.
మధు అతని భార్య కలిసి ముకుంద, మురారీల గది నుండి కొన్ని వస్తువులను చాటుగా తీసుకొస్తుంటారు. ఆ వస్తువులు ముకుంద చూస్తుందేమోనని ఒకవైపు మధు అతని భార్య టెన్షన్ పడగా, ముకుందేమో మురారి డైరీని తీసుకొస్తుంది. కాసేపటికి మురారి గదిలోకి వెళ్ళిన ముకుంద.. ఆ డైరీలో కొన్ని మాటలను రాసి అక్కడే ఉన్న కబోడ్ లోని బట్టలలో పెట్టేసి బయటకు వచ్చేస్తుంది. అప్పటికే కృష్ణ, మురారీలు ఇద్దరు ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చిన కృష్ణ, మురారీలని రేవతి ఆగమని చెప్తుంది. మీకోసం నేను వారం రోజులు లీవ్ తీసుకుంటే..
మీరు మధ్యలోనే వస్తారా అని కృష్ణ, మురారీలని రేవతి అడుగగా.. మా కమీషనర్ సర్ ఒక మిషన్ కోసం అర్జెంట్ గా రమ్మన్నాడని మురారి అంటాడు. అలా మురారి అనగానే.. మీ కమీషనర్ కి కాల్ చేయు. నేను మాట్లాడుతానని రేవతి అంటుంది. నీ కొడుకు మీద నమ్మకం లేదా.. ఇదేమైనా స్కూలా అమ్మా అని మురారి అనగానే.. నీ మాట నేను నమ్మను. కృష్ణ మాటనే నమ్ముతానని రేవతి అంటుంది. నిజమే అత్తయ్య.. ఏదో మిషన్ ఉందని తొందరగా వచ్చినట్లుగా కృష్ణ చెప్తుంది. ఇక సరేమని మురారిని వెళ్ళమంటుంది రేవతి.
మరొకవైపు వాళ్ళ గదిలోకి వెళ్ళిన మధు అతని భార్య కలసి ముకుంద, మురారీల గురించి మాట్లాడుకుంటారు. మురారిని ముకుంద ప్రేమిస్తుందనే విషయాన్ని మధు వాళ్ల భార్య మధుకి చెప్తుంది. అవునని మధు షాక్ అవుతాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్ళిన మురారి తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. ఏంటి ఏసీఫీ సర్ అలా ఉన్నారని కృష్ణ అడుగగా.. ఏమి లేదని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.