English | Telugu

Gowtham Av : కెజెఎఫ్ లెవెల్ లో గౌతమ్ జర్నీ వీడియో.. ఓటింగ్ లో అతడికే ప్లస్!

బిగ్ బాస్ సీజన్-8 లో గౌతమ్ ఎలిమినేషన్ దాకా వెళ్లి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రతీ టాస్క్ ఫుల్ కసిగా ఆడుతూ వంద శాతం ఎఫర్ట్స్ తో టాప్-5 లో చోటు దక్కించుకున్నాడు. అయితే బయట ఎలా ఉందంటే.. గౌతమ్‌ని బిగ్ బాస్ టీమ్ తొక్కేస్తుంది.. నిఖిల్‌ని విన్నర్ చేయాలని బిగ్ బాస్ టీమ్ ముందుగానే ఫిక్స్ అయ్యిందని వస్తున్న వార్తలకు చెక్ పెట్టడానికే ఇలా చేశారేమో అని అనుకుంటున్నారు. కానీ గౌతమ్ జర్నీ వీడియో చూసాక అది మార్చుకుంటారు. గౌతమ్ జర్నీ వీడియో అదిరిపోయింది. ఇది అందరికంటే ముందు చూపించడం కూడా ఓటింగ్ పరంగా అతనికి చాలా ప్లస్. ఎందుకంటే కీలకమైన చివరి వారంలో ఈ జర్నీ వీడియో కూడా ఓటింగ్‌ని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.

బిగ్ బాస్ ఆట మరో కీలకమైన దశకు చేరుకుంది. ఫినాలే వీక్‌లో ఫైనలిస్ట్‌ల జర్నీ వీడియోలు వాళ్ల ఓటింగ్‌పై చాలా ప్రభావితం చూపిస్తాయి. వాళ్ల జర్నీని ఎంత బాగా చూపిస్తే అన్ని ఓట్లు. ఎవరి జర్నీని ఎలా చూపించారు? ఎంతసేపు చూపించారు? ఎప్పుడు చూపించారు? ఇవన్నీ కూడా చాలా కీలకమే. అయితే ఇక విజేతను తేల్చేందుకు మూడు రోజుల ఓటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈ జర్నీ వీడియోల టైమింగ్ కూడా చాలా కీలకం. అయితే ఫైనలిస్ట్‌లలో తొలి జర్నీ వీడియో గౌతమ్‌కి పడింది. లైవ్ ఎపిసోడ్‌లో గౌతమ్ జర్నీ వీడియో చాలా ఎమోషనల్‌గా చూపించారు.

తన బిగ్ బాస్ జర్నీని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు గౌతమ్. తన తల్లి గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. లైవ్ ఎపిసోడ్‌లో దాదాపు 10 నిమిషాల పాటు.. తన లైఫ్ జర్నీ గురించి చెప్పాడు గౌతమ్. తను బిగ్ బాస్ హౌస్‌కి వచ్చింది రెస్పెక్ట్ కోసం అని.. తన లైఫ్‌లో ఇప్పటివరకూ రెస్పెక్ట్ దొరకలేదని.. రెస్పెక్ట్ కోసం ఎంత దూరం అయినా వెళ్తానని అన్నాడు గౌతమ్. బిగ్ బాస్ సీజన్ 7 తన లైఫ్‌కి ఎంతో మేలు చేస్తే.. బిగ్ బాస్ సీజన్ 8 తన లైఫ్‌కి మైల్డ్ స్టోన్ అని అన్నాడు. బిగ్ బాస్ జీవితాంతం రుణపడి ఉంటానంటూ గౌతమ్ సాష్టాంగ నమస్కారం చేశాడు.



Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.