English | Telugu

Actor Naresh Lolla : కన్నడ వాళ్ళ కంటే తెలుగు వాళ్ళేం తక్కువ.. భాష రాని వాళ్ళతో యాక్టింగా!

నరేశ్ లొల్ల.. తెలుగు సీరియల్స్ ద్వారా అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్-7 లో అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యాడు. అమర్ దీప్ కి ఆప్తుడు అయినటువంటి నరేశ్ లొల్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకున్నాడు.

ఈ మధ్య కాలంలో కన్నడ నటీనటులకి డిమాండ్ ఎక్కువ అయింది. కొత్తవాళ్ళని తీసుకోవాలంటే వాళ్ళనే తీసుకుంటున్నారు. మన తెలుగువాళ్ళని తీసుకోవడం లేదంటూ చెప్పుకొచ్చాడు. తెలుగులో ఎంతమంది హీరోలు లేరు.. చాలామంది ఉన్నారు. కానీ పక్క రాష్ట్రాల హీరో, హీరోయిన్లను ప్రమోట్ చేసినంతగా.. మన తెలుగు వాళ్లని ప్రమోట్ చేయడం లేదు టీవీ ఛానల్స్ వాళ్లు. ఒక్కసారి మా తెలుగు వాళ్లని కూడా ప్రమోట్ చేసి చూడండి. రేటింగ్ డబుల్ వస్తుంది. నేను కన్నడ వాళ్లని తక్కువ చేయడం లేదు కానీ.. కనీసం వాళ్లకి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం కూడా రావడం లేదు. తెలుగు భాష రాకపోవడం వల్ల.. ఆ డైలాగ్‌లకు అర్థం తెలియకపోవడం వల్ల.. ఎమోషన్స్ అన్నీ కిల్ అయిపోతున్నాయి. అయినా సరే వాళ్లనే పెడుతున్నారు.

సినిమాల్లో వచ్చే రెమ్యూనరేషన్ వేరు.. సీరియల్స్‌కి వచ్చే రెమ్యూనరేషన్ వేరు. సీరియల్స్‌‌లో తెలుగు వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే.. ఓ సీనియర్ నటుడు.. రెండు మూడు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఆయన ఒక్కోసారి ఫోన్ చేసి.. నరేష్ ఓ రెండు వేలు ఉన్నాయా? పేమెంట్ వచ్చాక ఇస్తా అని అడుగుతాడు. అంటే రెమ్యూనరేషన్ ఎంత తక్కువగా ఉన్నాయో మీరే అర్థం చేసుకోవచ్చు. తినడానికి తిండి లేక.. ఫ్యామిలీని పోషించుకోలే ఎంత మంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. మీరు అనుకున్నంత గొప్పగా మాకు పేమెంట్స్ ఇవ్వరు. ఈ సోకాల్డ్ ఇతర రాష్ట్రాల ఆర్టిస్ట్‌లతో పోల్చుకుంటే.. మాకు ఇచ్చే రెమ్యూనరేషన్ వాళ్ల కంటే 50 శాతం తక్కువ ఇస్తారు. పక్క రాష్ట్రాల నటీ నటులకు ఇక్కడ హోటల్స్ రూంలు ఇస్తారు.. ఫ్లైట్ టికెట్స్ పెడతారు.. కారు ఇస్తారు.. ఫుడ్ చార్జీలు కూడా ప్రొడ్యుసర్స్ భరిస్తారు. కానీ తెలుగు ఆర్టిస్ట్‌ల విషయానికి వస్తే.. కారు కన్వినెన్స్ ఇస్తారు.. అసిస్టెంట్ బేటా ఇస్తారు.. ఫుడ్ ప్రొడక్షన్ వాళ్లు పెడతారు. వాళ్లు ఏది పెడితే అది తినాలి. వాళ్లు ఇచ్చింది తీసుకుని వెళ్లాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు క్యాస్ట్యూమ్స్ కూడా ఇవ్వరు. నేను చేసిన సీరియల్స్‌లో ఇప్పటి వరకూ అన్నీ నేను కొనుకున్నవే. హీరో హీరోయిన్లకు క్యాస్ట్యూమ్స్ ఇస్తుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు మాత్రం సొంతంగా భరించాల్సిందే. అవి కూడా వాళ్లకి నచ్చినట్టు ఉండాలి. మనకి నచ్చింది కాదు. నేను అడిగేది ఏంటంటే.. వాళ్లకి ఇచ్చేటంత రెమ్యూనరేషన్ తెలుగు వాళ్లకి ఇవ్వమని అడగడం లేదు. వాళ్లకి ఇచ్చే సదుపాయాలు మాకు కల్పించమని అడగడం లేదు. మాకు వాళ్లకిచ్చేటంత బడ్జెట్ వద్దు.. అవకాశాలు ఇవ్వండి చాలు. వాళ్లకంటే ఖచ్చితంగా బాగా చేస్తాం.. వాళ్లకంటే మంచి ఔట్ పుట్ ఇస్తాం. వాళ్ల కంటే మంచి రేటింగ్ తెస్తాం. వాళ్లకంటే తెలుగు వాళ్లు ఎందులోనూ తక్కువగా అయితే చేయరని నరేశ్ లొల్ల అన్నాడు.

మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాం.. ఈ ఇండస్ట్రీని నమ్ముకుని బోలెడంత మంది ఉన్నారు. తిండిలేని వాళ్లు కూడా ఉన్నారు. ఇంతకు ముందు 20-22 పైన రేటింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు 4-6 రేటింగ్ వచ్చిందంటే గొప్పగా ఫీల్ అవుతున్నారు. తెలుగు వాళ్లని పెట్టి.. తెలుగు సీరియల్స్ తీయండి.. ఇంతకంటే మంచి రేటింగ్ ఖచ్చితంగా వస్తుందంటూ తమ కష్టాలని నరేశ్ లొల్ల చెప్పుకొచ్చాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.