English | Telugu

Avinash Av: కమెడియన్ కాదు కంప్లీట్ ఎంటర్‌టైనర్.. నవ్వుని పంచే మీరు అందరికంటే ఐశ్వర్యవంతులు!

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకి ముందు ప్రతి సీజన్‌లో టాప్-5 జర్నీ వీడియోలు చూపించడం ఆనవాయితీ. అయితే ఇందులో ఒక్కొక్కరి జర్నీ వీడియో ఒక్కో విధంగా చూపిస్తూ మంచి ఫీల్ ఇస్తుంటాడు బిగ్‌బాస్. ఇక దీని కోసం గార్డెన్ ఏరియాలో చేసే డెకరేషన్, సెలబ్రేషన్ మాములుగా ఉండవు. ఇక ఈ సీజన్ ఫైనలిస్టులకి కూడా జర్నీ వీడియోలను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసింది బిగ్‌బాస్ టీమ్. నేటి ఎపిసోడ్‌లో గౌతమ్, అవినాష్‌లకి సంబంధించిన జర్నీలను చూపించాడు బిగ్ బాస్.

గార్డెన్ ఏరియాలో తన కోసం చేసిన గ్రాండ్ సెటప్ చూసి అవినాష్ చాలా సర్‌ప్రైజ్ అయ్యాడు. ముఖ్యంగా బిగ్‌బాస్ జర్నీలో అవినాష్‌ సాధించిన విజయాలు, ఎమోషన్స్, తన భార్య వచ్చినప్పటి ఫొటోలతో పెద్ద ఆల్బమ్ ఏర్పాటు చేశారు. ఇది చూసి అవినాష్ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఎవిక్షన్ షీల్డ్, తను రెండో సారి మెగా చీఫ్ అయిన టాస్కుకి సంబంధించిన వస్తువులు చూసి ఒకసారి తన జర్నీని గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత అవినాష్ గురించి చాలా గొప్పగా చెప్పాడు బిగ్‌బాస్. అవినాష్.. తెలియని సముద్రం భయాన్ని పెంచితే తెలిసిన సముద్రం అంచనాలను పెంచుతుంది.. ఈరోజు మీరు ఈ స్థానంలో నిలిచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.. మీరు చుట్టూ ఉంటే ఉష్ణోగ్రత తనకి తానే కొన్ని డిగ్రీలు కోల్పోతుంది.. ఎన్ని డిగ్రీలు పొందినవారికైనా అది సాధ్యమవుతుందా చెప్పండి.. ఈ ఇంట్లో కొందరే మీ స్నేహితులైన అందరూ మీ ఆప్తులే.. మీ రింగుల జుట్టు మీ భార్యకి ఎంతో ఇష్టమైనప్పటికీ ఆట మీదున్న ప్రేమ కోసం దాన్ని త్యాగం చేశారు. ఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చెయ్యగలిగే జస్ట్ కమెడియన్ కాదు.. అన్నీ చేయగలిగే కంప్లీట్ ఎంటర్‌టైనర్‌లా మిమ్మల్ని మీరు ఆవిష్కరించారు.. అవినాష్ ఈ ప్రంపంచంలో అన్ని అనారోగ్యాల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే దివ్య ఔషధం నవ్వు ఒక్కటే.. ఆ నవ్వును పంచే మీరు అందరికంటే ఐశ్వర్యవంతులంటూ బిగ్‌బాస్ చెప్పాడు.

ఈ మాటలకి అవినాష్ కంటతడి పెట్టుకున్నాడు. జస్ట్ కమెడియన్ మాత్రమే కాదు ఎంటర్‌టైనర్ అని బిగ్‌బాస్ చెప్పినప్పుడు అవినాష్ ఫేసులో చాలా ఆనందం కనిపించింది. ఇక బిగ్‌బాస్ మాటలు పూర్తికాగనే విజిల్ వేసి థాంక్యూ అంటూ గట్టిగా అరిచాడు అవినాష్. తన జర్నీని ఇంత గ్రాండ్‌గా ప్లాన్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ చెప్పాడు.


Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.