English | Telugu

నాకు ప్రైజ్ మనీ వస్తే గంగవ్వకి పది లక్షలు ఇస్తాను.. నాగార్జున ముందు గౌతమ్ ప్రామిస్!

బిగ్‌బాస్ సండే ఎపిసోడ్‌లో అందమా అందమా అంటూ రొమాంటిక్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఇక వచ్చీ రాగానే హౌస్‌మేట్స్ అందరినీ 'ప్రైజ్ మనీ ఎంత' అంటూ కొశ్చన్ చేశారు. దీనికి రూ.54 లక్షల 30 వేలు అంటూ అందరూ చెప్పారు. అయితే అది ఫిక్స్ కాదు.. యాడ్ అవ్వొచ్చు తగ్గొచ్చు.. ఒకరు ఈరోజు వెళ్లిపోతారు.. మిగిలిన టాప్-5 ఎలా ఆడతారో దాన్ని బట్టే ప్రైజ్ మనీ టోటల్ ఫిక్స్ అవుతుందంటూ నాగార్జున చెప్పాడు. ఇక అది కాకుండా ముందుగా చెప్పినట్లు ఓ కారు కూడా ఫిక్స్ అంటూ నాగార్జున చెప్పారు.

ప్రైజ్ మనీ మీకు వస్తే ఏం చేస్తారనేది ఒక్కొక్కరు చెప్పాలంటూ నాగార్జున అడుగగా.. ముందుగా అవినాష్ నిల్చొని తానే విన్నర్ అయితే ఆ ప్రైజ్ మనీ ఏం చేస్తాడో చెప్పాడు.ఈ ప్రైజ్ మనీతో మా అన్నయ్య కూతురు పెళ్లి చేద్దామనుకుంటున్నా.. అన్నకి ముగ్గురు కూతుళ్లు.. పెద్దమ్మాయ్ పెళ్లి చేద్దామనుకుంటున్నానంటూ అవినాష్ చెప్పాడు. మరి రోహిణికి కారు కొనేసి ఇస్తా అని మాట ఇచ్చావ్ కదా అంటూ నాగార్జున అన్నాడు. అవును సర్ అది కూడా కొంటా అంటూ అవినాష్ అన్నాడు. ఇక ప్రేరణ అయితే.. నా పేరెంట్స్‌కి ఉన్న అప్పులన్నీ తీర్చేస్తా.. హౌస్ లోన్, కారు లోన్ అన్నీ.. మిగిలినవి ఇన్వెస్ట్ చేస్తా సార్.. అంటూ చెప్పింది. నబీల్ లేచి నా కల సినిమా.. నాకు తోచిన డబ్బుతో సినిమా తీసుకుంటా.. మంచి సినిమా తీస్తా సార్.. కెరీర్ మీద ఇన్వెస్ట్ చేస్తానంటూ సమాధానమిచ్చాడు. ఇక విష్ణుని అడగ్గా.. మణిబాబుకి (మణికంఠ) నానో కారు.. అభయ్‌కి ఫారెన్ టూర్.. గంగవ్వకి ఐదు లక్షలు.. ఇలా అందరికి కొంచెం కొంచెం పంచేస్తా.. అలా ప్రైజ్ మనీలో 70 పర్సంట్ అందరికి ఇచ్చేస్తా.. పృథ్వీకి గోల్డ్ ఇయర్ రింగ్స్.. నిఖిల్‌కి ప్లాటినమ్ ఇయర్ రింగ్స్.. ప్రేరణకి డైమండ్ నెక్లెస్.. అవినాష్‌కి తాడులు అంటూ పెద్ద లిస్టే చెప్పింది విష్ణుప్రియ. ఇదంతా విని నాగార్జున ఆశ్చర్యపోయాడు‌.

నిఖిల్ అయితే నేనే విన్నర్ అయితే ప్రైజ్ మనీతో అప్పులు తీర్చేస్తా సర్.. అలానే ఇప్పటివరకూ మాకు సొంతిల్లు లేదు .. చిన్నప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాం.. కనుక అమ్మ వాళ్లకి ఇల్లు కట్టిస్తానంటూ నిఖిల్ చెప్పాడు. చివరిగా గౌతమ్‌ని అడగ్గా లాస్ట్ సీజన్‌లో కూడా చెప్పా సర్.. అమ్మ రిటైర్ అవుతున్నారని.. కనుక తనకి సేవింగ్స్‌లా ఉండాలని ఇందులో 50 పర్సంట్ అమ్మకి ఉపయోగిస్తా.. ఇక రూ.10 లక్షలు గంగవ్వకి ఇస్తా.. వాళ్ల కూతురికి ఇల్లు కట్టాలని గంగవ్వ కోరిక.. కనుక ఆ ఇంటి కోసం వాడుకునేందుకు ఆమెకి ఇస్తానంటూ గౌతమ్ చెప్పాడు. ఇది విని నాగార్జున ఆశ్చర్యపోయాడు‌.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.