English | Telugu

Vishnupriya Elimination: నేను ట్రోఫీ ఎత్తుతుంటే నిఖిల్ నా పక్కన రన్నరప్.. కానీ ఆ విజన్ రాంగ్!

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా నిఖిల్‌ని సెకండ్ ఫైనలిస్ట్‌గా నాగార్జున ప్రకటించాడు. దాంతో నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత గౌతమ్, ప్రేరణలు ఫైనలిస్ట్‌లు అయిపోయారు. అయితే ఇక చివరిగా మిగిలిన నబీల్- విష్ణుప్రియ మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరగింది. నబీల్ చివరి ఫైనలిస్ట్ అయ్యాడని విష్ణుప్రియ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పాడు.

విష్ణు ఎలిమినేట్ అయిన తర్వాత ఏమాత్రం ఎమోషనల్ అవ్వలేదు. నేను అడిగిన ఓట్ అప్పీల్‌కి ఓట్లన్నీ ఆపేసినట్లున్నారు.. జనాలంటూ జోకులేసుకుంటూ బయటికొచ్చేసింది. ఇక వచ్చేముందు విష్ణుప్రియకి హగ్గు ఇచ్చి గౌతమ్ ఓ మాట చెప్పాడు. బయటికొచ్చాక కలుద్దాం.. నేనేంటో అర్థం కాలేదన్నావ్ కదా.. నన్ను బాగా అర్థం చేసుకుందువు గానీ అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి వామ్మో నాకు అంత టైమ్ లేదు అంటూ విష్ణు అంది. దీంతో నా గురించి తెలియాలంటే మీ చెల్లిని అడుగమన్నాడు గౌతమ్. ఇక స్టేజ్ మీదకి వచ్చాక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యింది విష్ణుప్రియ.

విష్ణు వెళ్లేముందు స్టేజ్‌పై సూర్య మండలం ఫొటో పెట్టించారు నాగార్జున. సూర్యడు విన్నర్ ట్రోఫీ అనుకుంటే దానికి ఎవరు దగ్గరగా ఉన్నారో వాళ్ల ఫొటోలు ఆ గ్రహం మీద పెట్టు అంటూ నాగ్ టాస్క్ ఇచ్చారు. దీంతో ట్రోఫీకి దూరంగా ఉన్న గ్రహంపై గౌతమ్ ఫొటో పెట్టింది విష్ణు. ఇప్పటికీ నీ ఆట ఏంటో నాకు తెలీదు.. ఇంటికెళ్లాక ఎపిసోడ్స్ అన్నీ చూస్తా.. నువ్వు ఏం ఆడావో చూస్తానంటూ గౌతమ్‌తో అంది విష్ణు. ఇక ఆ తర్వాత నా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ అంటూ అవినాష్‌కి 4వ ప్లేస్ ఇచ్చింది విష్ణుప్రియ. తర్వాత నా తమ్ముడు నబీల్‌కి మూడో ప్లేస్ అని, ప్రేరణ విన్ అవుతుందని నేను అనుకుంటున్నా.. ఈ సీజన్ ఒక అమ్మాయి విన్ అవ్వాలని నాకు కోరికగా ఉంది.. కానీ ప్రస్తుతానికి నా గట్స్ తనని సెకెండ్ ప్లేస్‌లో పెట్టమంటున్నాయంటూ ప్రేరణకి విన్నర్ ట్రోఫీకి దగ్గరగా సెకెండ్ ప్లేస్‌లో పెట్టింది. ఇక నిఖిల్ గురించి చెబుతూ.. నాకు ఫస్ట్ వచ్చిన విజన్ నేను ట్రోఫీ ఎత్తుతుంటే నిఖిల్ నా పక్కన రన్నరప్.. కానీ ఆ విజన్ రాంగ్.. విన్నర్‌కి క్లోజ్‌గా ఉన్నది నిఖిల్ అంటూ చెప్పింది విష్ణుప్రియ. ఇప్పటివరకూ ఈ పిచ్చి పిల్లని నత్తి బుర్ర ఉన్న నన్ను.. 14 వారాలు భరించి ఓట్లేసి ఇంత దూరం వరకూ తీసుకొచ్చినందుకు మీకు స్పెషల్ థాంక్స్ అంటూ ఆడియన్స్ కి బైబై చెప్పేసింది విష్ణుప్రియ.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.