English | Telugu
వారిద్దరి ప్రేమ విషయం పూర్తిగా తెలుసుకున్న రేవతి ఏం చేయనుంది?
Updated : Feb 20, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -85 లోకి అడుగుపెట్టింది. కాగా సోమవారం నాటి ఎపిసోడ్ లో.. వాలెంటైన్స్ డే కావడంతో భవాని ఇంట్లో వాళ్ళంతా కలిసి, ఇల్లంతా బెలూన్స్ తో డెకరేట్ చేసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా మొదటగా రేవతి, ఈశ్వర్ లు వాలైంటైన్స్ డే విషెస్ చెప్పుకొని ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. "ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కానీ స్వార్థాన్ని కాదు" అని ముకుంద ని ఉద్దేశించి రేవతి అంటుంది. ఆ తర్వాత మురారి బాబాయ్-పిన్ని ప్రేమ గురించి చెప్తారు. ఆ తర్వాత మధు-అలేఖ్యలు సరదాగా వాళ్ళ లవ్ స్టోర్ ని చెప్పుకుంటారు. కృష్ణ -మురారి లని చెప్పుమనగా ఒక్కసారిగా చుట్టూ ఎవరు లేరు అని అనుకోని కృష్ణ మనసులోని మాటలను చెప్తుంది. మనం బయట వారికి భార్యాభర్తలం కానీ మన మధ్య ఎలాంటి ప్రేమ లేదు. నా చదువు అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. నాకు ప్రేమించాలని ఉంది. నిన్నే ప్రేమించాలని ఉంది. అని కృష్ణ చెప్పకనే తన ప్రేమ
ని చెప్తుంది. ముందు నువ్వు చదువు పూర్తి చెయ్యి.. ఆ తర్వాత నీకు ఏమనిపిస్తే అది చెయ్ అని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణ, మురారి ఒకరికొకరు హ్యాపీ వాలెంటైన్స్ డే విషెస్ చెప్పుకుంటారు.
భవాని కూడా తన ప్రేమ గురించి చెప్తుంది. అలా చివరగా ముకుంద వంతు వస్తుంది. నన్ను ఆదర్శ్ అనుకొని చెప్పు ముకుందా అని కృష్ణ అంటుంది. గతంలో మురారి తొలి చూపు నుండి.. వాళ్ళ పరిచయం, ప్రేమ అంత కూడా మురారికే చెప్పినట్లుగా ముకుంద ఫీల్ అవుతూ హ్యాపీ వాలెంటైన్స్ డే అని రోజ్ ని మురారి వైపు చూస్తూ ఇవ్వగా ఆ రోజ్ కృష్ణ తీసుకుంటుంది. అందరూ ఆదర్శ్ గురించి ముకుంద బాగా చెప్పిందని అనుకుంటారు కానీ ముకుంద మాత్రం మురారి గురించి మాట్లాడుతుంది.
ముకుంద చెప్పింది విన్న రేవతి మురారి ఫ్రెండ్ గోపీని పక్కకు పిలిచి.. ముకుంద, మురారిల గురించి మొత్తం చెప్పకుంటే నా మీద ఒట్టే అని రేవతి తన తల మీద చెయ్యి వేసుకొని అడుగుతుంది. దాంతో గోపి చేసేదేమి లేక మురారి, ముకుందల ప్రేమ సంగతి చెప్తాడు. అలా వారిద్దరి ప్రేమ విషయం గోపీ పూర్తిగా చెప్పేస్తాడు. ఇకముందు రేవతి ఏం చేయనుంది? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..