English | Telugu

ఏడుకొండలు కామెంట్స్‌.. గెట‌ప్‌ శీను కౌంటర్!

'జబర్దస్త్' గురించి కిర్రాక్ ఆర్పీ చేసిన రగడ అంతా ఇంతా కాదు. మల్లెమాల సంస్థ మీద అత‌ను ఎన్నో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫుడ్, రెమ్యూనరేషన్ వంటి విషయాల్లో ఆర్టిస్ట్స్ కి అన్యాయం జరిగిందంటూ ఎన్నో విమర్శలు చేశాడు. ఆర్పీ వ్యాఖ్యలని హైప‌ర్ ఆది, ఆటో రాంప్రసాద్ ఖండించారు. జబర్దస్త్ మాజీ టీమ్ లీడర్ శేషు కూడా ఆర్పీని విమర్శించారు. ఇంత జరుగుతున్నా గెటప్ శీను, సుడిగాలి సుధీర్ మాత్రం ఈ వివాదంపై నోరు విప్పలేదు.

రీసెంట్‌గా ఈ వివాదంలోకి జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు ఎంట్రీ ఇచ్చి, గెటప్ శీను మీద ఎన్నో కౌంటర్లు వేశారు. జబర్దస్త్ మొదటి నుంచి ఎండింగ్ వరకు జరిగిన విషయాలన్నీ చెప్పారు. "జబర్దస్త్ షో నుంచి కిరాక్ ఆర్పీ వెళ్ళిపోయి నాలుగేళ్లు అవుతోంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి సీనియర్ నిర్మాతను విమర్శించే అర్హత వీడికేముంది?" అంటూ నేరుగా కౌంటర్లు విసిరారు.

జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిన సుధీర్, గెటప్ శీనును కూడా ఏడుకొండలు వ‌ద‌ల్లేదు. "మొదట్లో వీళ్ళను జబర్దస్త్ నుంచి ఓంకార్ తీసుకెళ్లే ప్రయత్నం చేసేటప్పుడు ఆ విషయం మీద వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడాలని టీం లీడర్‌ని చేస్తానని ప్రామిస్ చేసాను. గెటప్ శీనుకి కారు ఇచ్చాను. జబర్దస్త్ వదిలి వెళ్లిపోయిన అందరూ మళ్ళీ రావాలి. వాళ్ళు మిగతా ఛానెళ్లలో ఎలా పని చేస్తారో చూస్తాను" అంటూ ఒక ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. "సుడిగాలి సుధీర్ కి లైఫ్ ఇస్తే ఇప్పుడు కనీసం నా ఫోన్ ఎత్తడు. ఒక ఇంటర్వ్యూ లైవ్ లో సుధీర్ కి ఏడుకొండలు ఫోన్ చేయగా అతడు లిఫ్ట్ చేయలేదు".. ఇలా ఆరోపించిన ఏడుకొండలు మాటలకు గెటప్ శీను గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. "నేను జబర్దస్త్ లో చేసిన బిల్డప్ బాబాయ్ పాత్రకు ఇతడే స్ఫూర్తి" అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు.