English | Telugu

గీతూ రాయల్ వోట్ ఎవరికి వేసిందో చెప్పేసింది

గీతూ రాయల్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్. రీసెంట్ గా ఆమె ఒక వ్యాధి బారిన పడింది. దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్‌గా గీతూ ఫుల్ ఫేమస్ ఐపోయింది. అప్పుడప్పుడు కొన్ని షోస్ లో కనిపిస్తోంది. ఐతే అలాంటి గీతూ రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో తాను ఎవరికీ ఓటేసిందో చెప్పేసింది. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టింది. "హో డిడ్ యు వోట్ టు" అన్న ప్రశ్నకు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఆయా పార్టీల రంగుల్లో ఉన్న హార్ట్ ఎమోజిస్ గుర్తులను పెట్టి టీడీపీ కూటమికి ఓటేసినట్లు చెప్పింది.

అలాగే చంద్రబాబు-మోడీ-పవన్ కళ్యాణ్ చిత్రాలను కూడా పోస్ట్ చేసింది. ఇంకా 71 శాతం మంది కూటమికి ఓటేశారని వైసీపీకి 29 శాతం మంది మాత్రమే ఓటేశారని తన పోస్ట్ ద్వారా చెప్పింది చెప్పింది. ఐతే గీతూ ప్రస్తుతం తనకు వచ్చిన మైక్రో బ్యాక్టీరియల్ నాన్ ట్యూబర్‌క్యూలర్ ఇన్ఫెక్షన్ అంటే ఒకరకమైన టీబీ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది. ఇక ఈ వ్యాధి తగ్గాలంటే రెండేళ్ల పాటు అయిదు ఇంజెక్షన్లు తీసుకోవాలని డాక్టర్లు చెప్పారని గీతూ చెప్పింది. అంతే కాకుండా ఇంజెక్షన్లతో పాటు రెండేళ్ల వరకు పలు మెడిసిన్స్ కూడా వాడాల్సి ఉంటుందని చెప్పింది.

ఇంజెక్షన్లు, టాబ్లెట్లు అన్నీ చాలా కాస్ట్‌లీ అని, దాని వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది గీతూ. డాక్టర్లు తన వ్యాధి గురించి చెప్పిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లానని, ఐతే ప్రస్తుతం తన హెల్త్ కండిషన్ బానే ఉందని లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నానని చెప్పింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.