Read more!

English | Telugu

రాత్రి ఉండేది ఎందుకో మీకు తెలుసా...అందుకే


జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. కొన్ని మర్చిపోతాం కొన్ని మర్చిపోలేక అవస్థలు పడుతూ సరిగా తిండి తినక నిద్రపోలేక పని మీద శ్రద్ద పెట్టకుండా చివరికి నీరసించిపోతాం. మన కష్టాల్ని, కన్నీళ్లను రాత్రి సమయాల్లో ఎక్కువగా గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాం. ఇది ప్రతీ ఇంట్లో జరిగేదే ప్రతీ మనిషి జరిగేదే. మరి ఇదే విషయం మన చిత్తూర్ చిరుతకు కూడా జరిగింది. అందుకే రాత్రి పూట ఎక్కువగా బాధపడుతుందంట. మరి రాత్రి ఎందుకు ఉందో తెలుసా అంటూ రీసెంట్ గా ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది. 

"జరిగినవన్నీ మర్చిపోయి బతకడానికి పగలు ఉంటే మర్చిపోయినవన్నీ గుర్తు చేసుకుని ఏడవడానికి రాత్రి ఉంటుంది" అంటూ ఒక వేదాంతం చెప్పింది గీతూ. ఇక ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ కీర్తి భట్ కూడా "యా డైలీ" నేను ఏడుస్తా అన్నట్టుగా రిప్లై ఇచ్చింది. "ఏడ్చేసిన తర్వాత ఆ ప్రాబ్లెమ్ సాల్వ్ ఐపోయాక అనవసరంగా  ఏడ్చా నేనే ఏదో ఓవర్ థింక్ చేశా" అని మళ్ళీ ఫీలవుతా అంది గీతూ. ఇక నెటిజన్స్ కామెంట్స్ చూస్తే " అవును జరిగిపోయిన బీబీ కోసం, గెలవని కప్పు కోసం ..ఏడ్చి ఏడ్చి నీ కళ్ళు లోపలి వెళ్లిపోయాయి గీతూ...నువ్ ఏం చెప్పినా వినాలపిస్తుంది..." అని అంటున్నారు. బిగ్‌బాస్ హౌస్ లో  గీతూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. టాప్-5 కంటెస్టెంట్‌నని బలంగా నమ్మిన ఈమె 9 వ  వారంలో ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఎలిమినేట్ అవుతున్నప్పుడు బీబీ స్టేజి మీద కన్నీరుమున్నీరుగా ఏడ్చేసింది. ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఇలా కన్నీళ్లు పెట్టే లేడీస్ ఒక్కరైనా ఉంటారు.