English | Telugu

లాయల్టీగా ఉండకు.. నీ హ్యాపీనెస్ ని వేరేవాళ్ళ చేతుల్లో పెట్టకు !

ప్రస్తుతం సమాజంలో మనుషులు ఎంతలా మారిపోయారంటే.. అంటూ గీతు రాయల్ షేర్ చేసిన ఓ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. అసలేమైంది.. తను ఎందుకలా అంది ఓసారి చూసేద్దాం...

గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున.

బిగ్ బాస్ తర్వాత రెగ్యులర్ వ్లాగ్స్ , పోస్టులు చేస్తూ‌.. ఇటు యూట్యూబ్ లో అటు ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. రీసెంట్ గా వాళ్ళ నాన్నకి ఏదో ఆపరేషన్ అంటు మోస్ట్ ఎమోషనల్ వీడియోలని షేర్ చేసిన గీతు.. ఆ తర్వాత యాంకర్ ధనుష్ తో కలిసి కొత్త యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. ఇక తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది గీతు. నీ సోల్ మేట్ దగ్గర గానీ నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర గానీ నువ్వు లాయల్టీగా ఉండకు.. ఈ జనరేషన్ లో నీ లాయల్టీని అర్థం చేసుకొని , నీకు వ్యాల్యూ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు.. నువ్వు లాయల్టీగా ఉన్నా గానీ అవతలి వాళ్ళు ప్రేమని ప్రసాదం పంచినట్టు పంచుతా ఉంటారు. అది తెలిసిన రోజు సచ్చిపోతావ్.. కాబట్టి ఫస్ట్ నుండి పైపైనే ఉండు. నీ హ్యాపీనెస్ ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టొద్దు‌‌‌.. లాయల్టీగా ఉండకు అని గీతు అంది‌.‌ ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది.


Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.