English | Telugu

Priyanka Jain: తడిచీరలో సెగలు పుట్టిస్తున్న ప్రియాంక  జైన్... తన అందాలతో వీడియో వైరల్!

సోషల్ మీడియాలో మాములుగానే సెలబ్రిటీల ఫోటోల కోసం కొంతమంది నెటిజన్లు చూస్తుంటారు. అంతకముందు ఒకరో.. ఇద్దరు భామలు.‌. తమ హాట్ ట్రీట్ తో సోషల్ మీడియాని షేక్ చేయగా ప్రస్తుతం.. సాధరణంగా కనపడే కొంతమంది అమ్మాయిలు అందాల ఆరబోత ఇస్తూ నెట్టింట సెగ పుట్టిస్తున్నారు‌. అలా ప్రియాంక జైన్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రియాంక జైన్ సంప్రదాయంగా, పద్దతిగా కనిపిస్తుంటుంది. అయితే బిగ్ బాస్ లో గ్లామర్ షోతో ఆడియన్స్ కు షాకిచ్చింది. హౌస్ లో పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని కన్పించగా.. తన గ్లామర్ కి మంచి మార్కులే పడ్డాయి‌. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో మరోసారి తన అందచందాలతో ఆడియన్స్ కు ట్రీట్ ఇచ్చింది. తను ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో పర్పుల్ కలర్ చీరలో.. తడిసిన అందాలను చూపిస్తూ సెగ పుట్టించేస్తోంది. పైగా ఈ వీడియోకి.. ఆర్టిస్ట్‌గా నాలోని భిన్నమైన షేడ్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నాను అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అయితే సీరియల్ యాక్టర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సైతం ఈ వీడియోకి హాట్ ఈమోజీలని కామెంట్లుగా పెట్టేస్తున్నారు. ఇలా సెలెబ్రిటీలే కామెంట్లు చేయగా సాధరణంగా ఇన్ స్టాగ్రామ్ చూసే వీక్షకుల కామెంట్లు ఎలా ఉంటాయో తెలిసిందేగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు. ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్.‌ అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.