English | Telugu
నామినేషన్లో రతిక, ప్రియాంక.. గౌతమ్ కి యావర్ అటిట్యూడ్ తెచ్చిన మంట!
Updated : Sep 26, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో అనుకోని ట్విస్ట్ లతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సోమవారం నామినేషన్ల హవా నడుస్తుంది. ఒక్కో కంటెస్టెంట్ నామినేషన్లో చెప్పే సిల్లీ రీజన్స్ కి జ్యూరీ సభ్యులుగా ఉన్న శోభా శెట్టి, ఆట సందీప్, శివాజీతో పాటు చూసే ప్రేక్షకులకు అర్థమైంది.
అసలు అవసరం లేని విషయాలకి నామినేట్ చేశారని స్పష్టంగా తెలుస్తుంది. ప్రిన్స్ యావర్, గౌతమ్ ల మధ్య జరిగిన నామినేషన్ చూస్తుంటే ఇద్దరు ఒకరిని ఒకరు కొట్టుకుంటారేమో అనేంతలా గొడవ జరిగింది. అంతకముందు బిగ్ బాస్ కొన్ని నియమాలతో నామినేషన్ల ప్రక్రియని ప్రారంభించాడు బిగ్ బాస్. ఒకసారి నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్ ని మరే కంటెస్టెంట్ నామినేట్ చేయకూడదు, ఈ నామినేషన్ల ప్రక్రియ మొత్తం అయిదు భాగాలుగా ఉంటుంది.
అందులో సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయాలని, ఈ సారి బిగ్ బాస్ నే కాదు, జ్యూరీ మెంబర్స్ ని కూడా ఒప్పించాలని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో మొదట యావర్ తన నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టాడు. ప్రియాంక జైన్, టేస్టి తేజని నామినేట్ చేశాడు యావర్. ఇక రీజన్స్ చెప్తూ.. ప్రియాంక అవతలి వాళ్ళు చెప్పేది వినదని, గ్రూప్ అండ్ ఫెమినిజం కి సపోర్ట్ చేస్తుందని, నన్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని గేమ్ నుండి ఎలా తప్పిస్తారని యావర్ వాదించగా.. దానికి జ్యూరీ సభ్యులు అంగీకరించి ప్రియాంకని నామినేషన్ల బోర్డ్ లో చేర్చారు. ఆ తర్వాత శుభశ్రీ తన నామినేషన్ ప్రక్రియని కొనసాగించింది. రతిక, అమర్ దీప్ లని శుభశ్రీ నామినేట్ చేసింది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించి అమర్ దీప్ చెప్పింది ఫాలో అయి నన్ను నామినేట్ చేసింది. అది ఎంతవరకు కరెక్ట్ బయట ఉన్నవాళ్ళ గురించి అలా బ్యాడ్ గా చెప్పడం కరెక్ట్ కాదని శుభశ్రీ అనగా.. నేను నీలాగా కాదు, నాకు మైక్ తీసేసి గుసగుసలాడటం రాదని రతిక అంది.
నేను ప్రియాంకతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చి .. ఏంటి ఏంటి అని అడిగి లేనిపోనివి ఊహించుకొని ఇప్పుడు చెప్తున్నావ్ , నీ క్యారెక్టర్ ఏంటో చూసుకోమని శుభశ్రీతో రతిక అంది. దాంతో నోరు జారకు, నోటిని అదుపులో పెట్టుకోమని శుభశ్రీ అంది. ఇక ఇది సరైన రీజన్ అని జ్యూరీ సభ్యులు డిసైడ్ అయి రతిక పేరుని నామినేషన్ల లిస్ట్ లో చేర్చారు. ఇక ఆ తర్వాత యావర్ , టేస్టి తేజలని గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడు. అటిట్యూడ్, అగ్రెషన్ అంటూ యావర్ ని ఇమిటేట్ చేస్తూ గౌతమ్ కృష్ణ మాట్లాడేసరికి యావర్ కి కోపం వచ్చి.. నువ్వు అది ఆపేసేయ్ అంటూ ఫైర్ అయ్యాడు.
ఇక జ్యూరీ సభ్యులైన ఆట సందీప్, శివాజీ లు బోనులో నిల్చోమని, అది బిగ్ బాస్ రూల్ అని ఎంత చెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగాడు యావర్. ఇక కాసేపటికి యావర్ ని నామినేషన్ల లిస్ట్ లో ఉంచారు జ్యూరీ సభ్యులు. అయితే గౌతమ్ కృష్ణ చెప్పిన దాంట్లో పాయింట్ లేదని, జ్యూరీ సభ్యులతో అగ్రెసివ్ గా ప్రవర్తించాడు కాబట్టి నామినేషన్ల ఉంచామని ఆట సందీప్, శివాజీ చెప్పి నామినేషన్ల బోర్డ్ లో యావర్ ఫోటోని ఉంచగా.. కాసేపటికి మీ సొంత నిర్ణయాల కోసం కాదు ఈ నామినేషన్ ప్రక్రియ, గౌతమ్ కృష్ణ చెప్పిన రీజన్స్ వ్యాలిడ్ కాదని బిగ్ బాస్ చెప్పగానే అతని ఫోటోని నామినేషన్ల లిస్ట్ నుండి తీసేశారు జ్యూరీ సభ్యులు. ఇంక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరు, ఎవరిని నామినేట్ చేస్తారో చూడాలి మరి.
