English | Telugu

సింగర్ దామిణి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికే మూడు వారాలు పూర్తయ్యాయి. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీల ఎలిమినేట్ కాగా మూడవ వారం సింగర్ దామిణి ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ సీజన్-7 రోజురోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. అయితే సోమవారం నామినేషన్లు, శనివారం హోస్ట్ నాగార్జున వచ్చి ఒక్కో కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ చూసి కొందరిని తిడుతూ మరికొందరిని‌ మెచ్చుకున్నాడు. అయితే ఆదివారం ఎలిమినేషన్ జరిగింది. కాగా ఇప్పటికే హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరేంటని బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్థమైంది. ఒక్కొక్కరికి హోస్ట్ నాగార్జున చాలా గట్టిగానే క్లాస్ పీకాడు. హౌజ్ నుండి దామిణి ఎలిమినేట్ అయింది‌‌.

సీజన్-7 మొదలైందే ఉల్టా పల్టా థీమ్ తో.. అంటే సాధారణంగా ప్రతీ సీజన్ లో లాగా ఓటింగ్ లో చివరన ఉండేవాళ్ళని కాకుండా ఈ సారి ఉల్టా పల్టా చేసి.. టాప్ లో ఉండేవారిని ఎలిమినేట్ చేస్తారేమో అని అనుకున్నారంతా, కానీ ఓటింగ్ ప్రకారం టాప్ లో ప్రిన్స్ యావర్ ఉన్నాడు. రతిక రోజ్ సెకండ్ స్థానంలో ఉంది. చివరి స్థానంలో దామిణి ఉంది. కంటెంట్ కోసం రతిక నటిస్తోందని ప్రేక్షకులకు ఇప్పటికే అర్థం అయింది. ఇక అమర్ దీప్ ఉన్నాడా లేదా అనిపిస్తుంది. అందరు అమర్ దీప్ ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారంతా కానీ దామిణి ఎలిమిమేట్ అయింది. దామిణి‌ హౌజ్ లో‌ ఇక్కడి ముచ్చట్లు అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్తూ గొడవలు పుట్టించేది‌. ఇక గతవారం టాస్క్ లో ప్రిన్స్ యావర్ నోట్లో పేడ కొట్టి, జండు బామ్ పెట్టి, ముక్కులో గడ్డి దూర్చి పైశాచి ఆనందాన్ని పొందింది. దాంతో ప్రేక్షకుల దృష్టిలో కంప్లీట్ నెగెటివ్ ఇంపాక్ట్ తెచ్చుకుంది దామిణి.

ఇక ఓటింగ్ లో జస్ట్ 2 శాతం ఓటింగ్ మాత్రమే దామిణికి పడటంతో తను లిస్ట్ లో అట్టడుగునకి చేరింది. ఇక తను నామినేషన్లలో చెప్పే పాయింట్లు కూడా చాలా‌ సిల్లీగా అనిపించాయి. అది దామణి బయటకు రావడానికి మరింత కారణమయ్యాయి.‌ ఈ వచ్చేప్పుడు కూడా బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్స్ కి కొన్ని సలహాలని ఇవ్వగా అవి కాస్త ఫేక్ అని తేలింది. శివాజీ కరెక్ట్ మాట్లాడిన తనేదో తప్పు అన్నట్టు మాట్లాడిన దామిణి మాటలని నమ్మడానికి కాసింతైన అవకాశం లేకుండా పోయింది.

అయితే బిగ్ బాస్‌ హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో మూడవ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ గా దామిణిని చెప్తున్నారు. వారానికి రెండు లక్షల చొప్పున, మూడు వారాలకి గాను మొత్తంగా ఆరు లక్షలు దామిణి రెమ్యనరేషన్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. దామిణి ఎలిమినేషన్ జరిగిన తర్వాత బిబి బజ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ గీతు రాయల్ తో జరిగింది. ఈ ప్రోమోలో దామిణి కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసింది. హౌజ్ లో కంటెస్టెంట్స్ గురించి గీతు రాయల్ అడుగగా.. ఒక్కో కంటెస్టెంట్ గురించి తన పాయింటాఫ్ లో చెప్పింది దామిణి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.