English | Telugu

శ్రీముఖికి ఆరు నెలల్లో పెళ్లి చేస్తానన్న గంగవ్వ...

ఉగాది సందర్భంగా ఈ వారం ఎన్నో ఈవెంట్స్ బుల్లితెర మీద ప్రసారమయ్యాయి. అందులో స్టార్ మా ప్రసారమైన మా ఇంటి పండగ షో ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఇందులో బుల్లితెర మీద నటించే నటీనటుల కుటుంబాలు వచ్చాయి. అలాగే మై విలేజ్ షో టీమ్ మొత్తం కూడా ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వ ఇటు వెబ్ సిరీస్ లో, మూవీస్ లో నటిస్తోంది. రీసెంట్ గా సేవ్ ది టైగర్స్ లో, గేమ్ చెంజర్ మూవీలో నటించింది. ఇక సేవ్ ది టైగర్స్ లో గంగవ్వ కోడలిగా జోర్దార్ సుజాత నటించింది. ఈ షోకి ఆమె ఫ్యామిలీ కూడా వచ్చింది. ఐతే తనకు సుజాత పెళ్లి కూడా గంగవ్వ ఊరు వెళ్లాకే జరిగిందని చెప్పాడు రాకేష్.

ఇక శ్రీముఖి వెంటనే "అందరికీ పెళ్లిళ్లు చేస్తున్నావ్..మరి నాకు చెయ్యాలనిపించలేదా" అని అడిగేసరికి "ఆరు నెలల్లో పెళ్లి చేసేస్తా..వచ్చే ఉగాదికి నువ్వు బిడ్డనెత్తుకుని మళ్ళీ షోకి వస్తావ్" అని ఆశీర్వదించింది గంగవ్వ. అందులో అనీల్ జీల, గంగవ్వ, శివ, లంబాడిపల్లి చందు, రాజు, శ్రీకాంత్ అంటూ మై విలేజ్ టీమ్ గురించి చెప్పుకొచ్చింది. ఇక గంగవ్వ తమకు ఎంతో సాయం చేసిందని, గంగవ్వ ఎక్కడ అడుగుపెడితే అక్కడ అదృష్టం వస్తుందని చెప్పాడు అనిల్. ఇక ఈ టీమ్ మొత్తం కలిపి గంగవ్వను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు కడిగారు. పూల మాల వేసి షాల్ కప్పి చేతిలో చీర పెట్టి సత్కరించారు. "నాకు ఒక కొడుకు ఉన్నాడు. కానీ వాడి మీద నాకు అస్సలు ప్రేమ లేదు. కానీ వీళ్లందరి మీద నాకు చాలా ప్రేమ ఉంది. వీళ్లంతా నన్ను సొంత తల్లి లెక్క చూసుకుంటారు. జోర్దార్ సుజాత నా కన్న బిడ్డ లెక్క ఉంటుంది. నా చిన్నప్పుడు పడిన బాధలన్నిటినీ వీళ్లందరినీ చూసాక పోయాయి." అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యింది. ఇక సుజాత వచ్చి గంగవ్వను హగ్ చేసుకుంది. గంగవ్వ మల్లేశం, లవ్ స్టోరీ, గాడ్ ఫాదర్ వంటి ఎన్నో మూవీస్ లో నటించింది. తన పల్లెటూరి యాసతో అందరినీ నవ్విస్తూ ఉంటుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 4 కి కూడా వెళ్ళొచ్చింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.