English | Telugu

ఆ దేవుడు హైట్ కట్ చేశాడు.. నువ్ శాలరీ కట్ చేస్తున్నావ్.. పెద్ద తేడా లేదు!

శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఫామిలీ సర్కస్ పేరుతో ఫామిలీస్ ని పిలిపించి పిక్నిక్ ఏర్పాట్లు చేసి ఫుల్ గా ఆడి పాడారు. ఇక నాటీ నరేష్ , ఆటో రాంప్రసాద్ మధ్య డిస్కషన్ సూపర్ ఫ్లోలో సాగింది. " పొద్దున్న పూట వచ్చే కలలు నెరవేరవుతాయా" అని రాంప్రసాద్ ని నాటి నరేష్ అడిగేసరికి "వీడికేదో కల వచ్చి ఉంటుంది

" అనుకుని " ఏం కల వచ్చింది" అని అడిగాడు రాంప్రసాద్ " మీరు బాగుపడినట్టు కలొచ్చింది" అని నరేష్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చేసరికి రాంప్రసాద్ షాకయ్యి "నా మీదే పంచ్ వేస్తావా నీకు శాలరీ కట్ చేస్తా" అనేసరికి " ఆ దేవుడు హైట్ కట్ చేసాడు నువ్ శాలరీ కట్ చేస్తున్నావ్" పెద్ద తేడా లేదు అనేసరికి "ఇదిగో నీ శాలరీలో కొంత కట్ చేస్తి ఇస్తున్నా అంటూ ఒక నోట్ తీసి కత్తెరతో కట్ చేసి ఇచ్చాడు" రాంప్రసాద్.

ఇక స్కిట్స్, గేమ్స్, డాన్స్ పెర్ఫార్మెన్సులు అయ్యాక పిక్నిక్ లో అందరూ కలిసి భోజనాలు చేశారు. ఇంతలో బులెట్ భాస్కర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గా వచ్చి ఫుడ్ ఐటమ్స్ పరిశీలిస్తుంటే ఆటో రాంప్రసాద్ మాత్రం పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేసాడు. ఇక నూకరాజు ఇంద్రజని తెగ పొడిగేసాడు.." ఇంద్రజ గారి నవ్వు లాంటి తియ్యటి స్వీట్ వేయరా" అని అడిగేసరికి ఇంద్రజ నవ్వేసింది. "పప్పు ఎలా ఉంది" అని రాంప్రసాద్ నూకరాజుని అడిగాడు " ఇంద్రజ మేడం జడ్జిమెంట్ లా ఉంది" అని ఆన్సర్ ఇచ్చేసరికి ఇంద్రజాకి కోపం వచ్చేసింది. "నన్ను ముద్దపప్పు అని ఇండైరెక్ట్ గా పొగుడుతున్నావా..అరేయ్ నీ మనసులో ఏం ఉందో నాకు తెలుసు మళ్ళీ కవర్ చేసుకుంటున్నావా" అంది ఇంద్రజ.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.