English | Telugu

వాళ్ళ ఎలిమినేషన్ అస్సలు కరెక్ట్ కాదు!

జబర్ధస్త్ ఫైమా ..స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఆమె కామెడీ టైమింగ్ అద్దిరిపోతుంది. పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. చాలా తక్కువ టైములో బుల్లితెర మీద తనకంటూ ఒక స్పెషల్ ఫేమ్ ని సంపాదించుకుంది.ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ దక్కించుకుంది...అలాగే హౌస్ లోంచి బయటకు వచ్చాక మరింత పేరును సంపాదించుకుంది.

ఇప్పుడు బీబీ జోడిలో ఆర్జే సూర్యకి జోడీగా చేస్తోంది. బుల్లితెర షోస్ తో పాటు యూట్యూబ్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఫైమా. తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో తన ఫాన్స్ కి ప్రశ్నలు అడిగే టాస్క్ ఇచ్చింది. " బీబీ జోడిలో మీ ఫేవరేట్ జోడి ఎవరు" అని అడిగారు ఒక నెటిజన్. "అఖిల్-తేజు అంటే ఇష్టం. వాళ్ళ ప్రాక్టీస్ చూస్తూ ఉంటాను కదా చాలా కష్టపడతారు. చాలా బాగా మాట్లాడారు...నాచురల్ గా ఉంటారు." అని చెప్పింది.

"శ్రీ సత్య గురించి ఒక మాటలో చెప్పండి" అన్న మరో ప్రశ్నకు " ఒక్క మాట కాదు వంద మాటలు చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వచ్చాక మర్చిపోకుండా కాల్ చేస్తూ నేనున్నాను అని ధైర్యం చెప్పేది. తను ఫ్రెండ్ షిప్ కి చాలా వేల్యూ ఇస్తుంది. నేను మర్చిపోయిన తాను కాల్ చేయడం అస్సలు మర్చిపోదు" అని చెప్పింది. "రవికృష్ణ-భాను జోడి ఎలిమినేషన్ కరెక్టా?" అన్నదానికి "నో" అని ఆన్సర్ చేసింది. ఫైమా ఎన్నో కష్టాలు ఎదుర్కొని, పేదరికం నుంచి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.