English | Telugu

'జబర్దస్త్' స్టేజి మీద సుజాతకు రింగ్ తొడిగి ముద్దు పెట్టి మరీ ప్రపోజ్ చేసిన రాకేష్!

జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత మధ్య కెమిస్ట్రీ గురించి అందరికీ తెలుసు. చాలా ఏళ్ల నుంచి ఈ షోలో చేస్తున్న రాకేష్ ప్రస్తుతం టీమ్ లీడర్ గా స్కిట్స్ చేస్తున్నాడు.

ఇక న్యూస్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుజాత ‘జోర్దార్’ సుజాతగా పేరు సంపాదించి ‘బిగ్ బాస్’ షోలోనూ పార్టిసిపేట్ చేసి ఆకట్టుకుంది. తన యూట్యూబ్ వ్లాగ్స్ లో ఎక్కువగా రాకేష్ తో కలిసి కనిపిస్తూ ఉంటుంది. వీళ్లిద్దరిపై మొదట్లో ఎవరికీ డౌట్ రాలేదు కానీ తర్వాత ఈ జంట బయట కూడా జోడీగా విహారయాత్రలు చేస్తూండేసరికి అందరిలోనూ డౌట్ స్టార్ట్ అయ్యింది. తర్వాత కొన్ని రోజులు తాము లవర్స్ అంటూ వాళ్ళే కంఫర్మ్ చేశారు. కొన్ని రోజుల ముందు సుజాత బర్త్ డే కోసం ఇద్దరూ కలిసి దుబాయికి, ఇటు కొత్త సంవత్సరం సందర్భంగా విజయవాడకు కూడా వెళ్లారు.

ఐతే ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో భాగంగా స్టేజీపై స్కిట్ ఐపోయాక ఫైనల్ గా రాకేష్ రింగ్ సుజాత వేలుకి రింగ్ తొడిగి ప్రపోజ్ చేశాడు. అది చూసి షాకయ్యింది సుజాత. వెంటనే రాకేష్ సుజాతను దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రోమోలో ఈ లవ్ ప్రొపోజల్ కనిపించింది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.