English | Telugu

23 నుంచి జీ తెలుగులో రాత్రి 7 గంటలకు ‘శుభస్య శీఘ్రం’ కొత్త సీరియల్ ప్రారంభం!

జీ తెలుగు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో డిఫరెంట్ సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. కామెడీ, డాన్స్, సింగింగ్ షోస్, ఆసక్తికర మలుపులతో సాగుతున్నసీరియల్స్ తో ముందుకు దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో నూతన సంవత్సర, సంక్రాంతి కానుకగా ‘శుభస్య శీఘ్రం’ అంటూ మరో కొత్త సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సీరియల్ విషయానికి వస్తే ఇది ఆర్థిక అసమానతలు, ఆత్మాభిమానం మధ్య చిగురించిన ఒక అద్భుతమైన ప్రేమకథగా తెరకెక్కింది. మహేష్ బాబు- కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ‘శుభస్య శీఘ్రం’ 23 నుంచి ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు ప్రసారం కావడానికి రెడీ ఐపోయింది. ఒక మధ్య తరగతి తల్లికి అండగా ఉండే కూతురు తన కుటుంబాన్ని ఆపదల నుంచి ఎలా రక్షించుకుంది అనే ఒక ఇంటరెస్టింగ్ స్టోరీ కంటెంట్ తో తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తోంది. కలవారి అబ్బాయి రాధాగోవింద్ గా మహేష్, కుటుంబ బాధ్యతలను తలకెత్తుకునే ఆడపిల్ల కృష్ణగా కృష్ణప్రియ కనిపిస్తారు.

కుటుంబమే ప్రధానంగా భావించే హీరో లైఫ్ లో కృష్ణ ఎంట్రీ ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టింది ? వాళ్ళ మధ్య ద్వేషంగా మొదలైన పరిచయంలో ప్రేమ ఎలా పుట్టింది ? ఉప్పు, నిప్పులా ఉండే వారిద్దరిని ప్రేమ ఎలా ఒకటి చేసింది ? అనేది తెలుసుకోవాలంటే 23 వరకు వేచి చూడాల్సిందే. అలాగే బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ఆడియన్స్ ని అలరిస్తున్న సాండ్ర జయచంద్రన్, భావన, ఉమాదేవి ఈ సీరియల్లో ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. ‘శుభస్య శీఘ్రం’ సీరియల్ కారణంగా "దేవతలారా దీవించండి" సీరియల్ సాయంత్రం 6 గంటలకు, ‘రాధమ్మ కూతురు’ సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానున్నాయి.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.