English | Telugu

నిఖిల్ ని కోపంగా చూసిన కావ్యశ్రీ.. ముఖం చాటేసిన కపట ప్రేమికుడు!

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 లో రైతు బిడ్డ అంటూ పల్లవి ప్రశాంత్ సానుభూతి పొంది విజేతగా నిలిస్తే సీజన్-8 లో కావ్యశ్రీతో నాకు బ్రేకప్ అయ్యింది.. కప్ గెలిచాక వెళ్ళి తనని కలుస్తానంటూ సానుభూతి తెచ్చుకొని విజేతగా నిలిచాడు నిఖిల్. ఇక బిగ్ బాస్ షో నుండి బయటకెళ్ళాక డైరెక్ట్ బెంగుళూరు వెళ్ళిన నిఖిల్ అక్కడ తన ఫ్రెండ్స్ తో సరదాగా గడిపుతున్నాడు.

బిగ్ బాస్ సీజన్-8 లో టాప్-5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు అందరి లవ్ స్టోరీలని, మర్చిపోలేని విషయాలని షేర్ చేసుకోమనగా.. ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పగా మన నిఖిల్ మాత్రం తెగ యాక్ట్ చేశాడు. కావ్యే నా భార్య... నా ఫస్ట్ లవ్.. నా సెకండ్ లవ్.. థర్డ్ లవ్.. అన్ని బ్రేకప్ లవ్ స్టోరీలను మరిచిపోయేట్టు చేసింది. మా ప్రేమ కావ్యానికి ఆరేళ్లు పూర్తైంది. మేమ్ కలిసి ఉన్నామా విడిపోయామా అంటే.. మా బంధం తెగిపోలేదు. కావ్య నా భార్య అని మైండ్‌లో ఫిక్స్ అయ్యా.. ఇక తనే నా భార్య. జన్మజన్మలకు తనే నా భార్య. తను కూడా మా అమ్మ లాగే.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం.. ఆమె ముందు నిలబడతా. తను కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే పడతా.. ఐ లవ్యూ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటు తెగ నటించేశాడు నిఖిల్.

తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో వచ్చింది. ఇందులో నిఖిల్ బ్లాక్ అద్దాలు పెట్టుకొని వచ్చేశాడు. ఇక యాంకర్ శ్రీముఖి అద్దాలు తీయొచ్చు కదా అనగా.. ఇవి తీయకపోవడమే మంచిది అని నిఖిల్ అన్నాడు. ఇక ఇదే షోలో తన మాజీ ప్రేమికురాలు కావ్యశ్రీ కూడా ఉంది. దాంతో వీళ్లిద్దరినీ ఎదురెదురుగా పెట్టి మాట్లాడించడానికి శ్రీముఖి చూడగా.. కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది. కనీసం నిఖిల్‌ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు కానీ.. కావ్యశ్రీకి మాత్రం కన్నీళ్లు ఒక్కటే తక్కువ అన్నట్టుగా చాలా దిగులుగా కనిపించింది. తెగిపోయిన బంధం మళ్లీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్టుగానే కనిపించాయి కావ్య చూపులు. మరి నిఖిల్, కావ్యశ్రీ ఇద్దరు మాట్లాడుకున్నారో లేదో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.