English | Telugu

తెలుగు-కన్నడ వివాదంపై స్పందించిన బ్రహ్మముడి రుద్రాణి.. అంతా ఒక్కటే అంటూ నిఖిల్ కే సపోర్ట్!

తెలుగు టీవీ ఇండస్ట్రీపై బిగ్ బాస్ షో ప్రభావం గట్టిగానే పడింది. ఈ షో సాగుతున్నన్ని రోజులు టీవీ సీరియల్స్ రేటింగ్ పడిపోయాయి. అయితే సీజన్-8 లో కన్నడ యాక్టర్ నిఖిల్ గెలవడంపై , హౌస్ లో కూడా వారిదే మెజారీటీ ఉండటం.. వారికే బిగ్ బాస్ సపోర్ట్ చేయడం పెద్ద దుమారం రేగింది. ఈ తరుణంలో రీసెంట్ గా సీనియర్ యాక్టర్ కౌశిక్ తెలుగు ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వడం లేదంటు ఎమోషనల్ అవ్వగా తాజాగా షర్మిత గౌడ కూడా రియాక్ట్ అయ్యింది.

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో బ్రహ్మముడి కి ఉండే క్రేజే వేరు. అందులో సుభాష్‌, ప్రకాష్ లకి చెల్లిగా, రాజ్ కి మేనత్తగా రుద్రాణి పాత్రలో షర్మిత గౌడ నటిస్తోంది. ఇందులో మోస్ట్ పాపులర్ లేడి విలన్ గా షర్మిత గౌడ గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే తను తాజాగా మీడియాతో తెలుగు కన్నడ వివాదంపై మాట్లాడింది. తెలుగు కన్నడ అంటు ఏం లేదు.. అంతా ఆర్టిస్టులమే.. మనమంతా ఇండియన్స్ అని రుద్రాణి అంది. సీజన్-8 లో నిఖిల్‌ని గెలిపించాలని కోరుతూ అతనికి ఓట్లు వేయమని పోస్ట్ పెట్టింది రుద్రాణి. ఓ పక్క ఆల్ ఆర్ ఇండియన్స్ అంటూనే.. కన్నడ వాడు కాబట్టి నిఖిల్‌కి సపోర్ట్ చేస్తున్నావా అంటూ షర్మిత తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు.

తెలుగు కన్నడ అనే బాషాభేదాలు లేనట్లయితే హౌస్ లో అంత మంది కంటెస్టెంట్స్ ఉండగా కన్నడ అతడికే ఎందుకు సపోర్ట్ చేశారంటు నిజంగా షర్మితకి అంత కన్నడ భాషాభిమానం లేకపోతే.. తెలుగు కంటెస్టెంట్స్ అంతమంది ఉన్నారు కదా.. మరి వాళ్లలో ఎవరికైన సపోర్ట్ చేయొచ్చు కదా.. తెలుగు వాళ్లు గెలవకూడదా.. తెలుగు బిగ్ బాస్‌లో తెలుగు వాడు గెలవాలంటే తప్పా అంటూ షర్మితకి కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు. రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ నిఖిల్ గురించి మాట్లాడిన ఈ మాటలు.. మరోసారి ఈ వివాదానికి ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయి. అయితే షర్మిత గౌడ చేసిన వ్యాఖ్యలని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నిఖిల్ ఈ పోస్ట్ కి లైక్ చేయడంతో ఇది ఇప్పుడు మరింతగా ట్రెండింగ్ అవుతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.