English | Telugu
దీపావళికి తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్న ‘ఇది కదా పండగంటే’
Updated : Oct 11, 2022
బుల్లితెర మీద నిన్న మొన్నటి వరకు దసరా ఈవెంట్స్ పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు దీపావళి పండగ రాబోతోంది. దీన్ని పురస్కరించుకుని ఇప్పుడిప్పుడే కొత్త షోస్ బుల్లితెర మీద ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. వీటి ప్రోమోస్ ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ పండగ సందర్భంగా మల్లెమాల వాళ్ళు ఆల్రెడీ ఒక ఈవెంట్ ప్రోమోని సోషల్ మీడియాలో వదిలేశారు. "ఇది కదా పండగంటే" పేరుతో ఈ షోని డిజైన్ చేశారు. యాంకర్ రష్మీ, రవి హోస్ట్స్ గా ఈ షోకి నిర్వహించబోతున్నారు.
ఇక ఎంట్రీనే ఇరగదీసింది. "ఒక బీభత్సమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోండ్ర" అంటూ రష్మీ, రవి మాస్ డాన్స్ తో స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. "లక్ష దీపాల వెలుగుల మధ్య దీపావళి సెలెబ్రేట్ చేసుకోబోతున్నాం" అని చెప్పింది రష్మీ. ఇక ఈ షోకి సంగీత, పోసాని కృష్ణమురళి గెస్టులుగా వచ్చారు. అలాగే బుల్లితెర స్టార్స్ అంతా వచ్చి డాన్స్ చేసేసరికి "ఇది కదా పండగంటే" అంటూ ఫుల్ జోష్ తో చెప్పేసింది రష్మీ. ఫైనల్ గా అందరూ స్టేజి మీద దీపాలు వెలిగించి పండగ చేసుకున్నారు. "మోస్ట్ ఎంటర్టైనింగ్ ఈవెంట్ ఆఫ్ ది డికేడ్" అంది అంటూ సోఫాలో పడుకుని మస్త్ కాంప్లిమెంట్ ఇచ్చేసాడు "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరో నవీన్ పోలిశెట్టి".