English | Telugu

Karthika Deepam2 : పారిజాతం  పీకపట్టుకొని నిలదీసిన జ్యోత్స్న.. ‌ఆమె ప్రెగ్నెంట్, ఈమె షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -74 లో.... నేను కేవలం శౌర్య కోసం మాత్రమే అక్కడికి వెళ్తాను. అమాయకంగా తను పిలిచే పిలుపు బాగుంటుంది. నేను దీపతో మాట్లాడిన దీప దగ్గరికి వెళ్లిన అన్ని రౌడీ కోసమే అని కార్తీక్ జ్యోత్స్న కి క్లారిటీ ఇస్తాడు. మరొకవైపు శౌర్య స్కూల్ అయిపోయాక దీప కోసం చూస్తుంది. తన పక్కన ఒక పాప తన నాన్నని ఎందుకు లేట్ గా వచ్చావంటూ అడుగుతుంది. వాళ్ళ ప్రేమని చూసి నాకు నాన్న ఉంటే అలాగే ఉండేదాన్ని కదా అంటూ ఏడుస్తుంది.

ఆ తర్వాత పారిజాతం పీకపట్టుకొని ఎందుకు ఇదంతా చేసావని జ్యోత్స్న అడుగుతుంది. మీ బావని కూడ ఇలాగే అడిగావా అని పారిజాతం అనగానే.. గొంతు పట్టుకొని అడగలేదు కానీ ఇదే రేంజ్ లో అడిగాను. అప్పుడే అదంతా శౌర్య కోసమని చెప్పాడని జ్యోత్స్న అనగానే..‌నువ్వు ఇప్పుడే తెలుసుకున్నావ్ కానీ నాకు ఎప్పుడో తెలుసని పారిజాతం అంటుంది. ఇప్పుడు నా ఆవేశమే నాకు ముఖ్యం. భర్త వదిలేసిన ఆడదానిగా దీపపై బావకి విపరీతంగా సింపతీ ఉంది. అలాంటి టైమ్ లో శౌర్య కోసం ఇద్దరు ఒకటి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ని రోజులు శౌర్యకి గార్డియన్ గా కార్తీక్ ఉన్నాడు.. ఇప్పుడు నేనున్నాను. ఏ ఇన్ఫర్మేషన్ అయిన ఇప్పుడు నాకు వస్తుందని జ్యోత్స్న అంటుంది. దీపని కార్తీక్ కలుస్తాడు కదా ఫోన్ కూడా కొనిచ్చాడని పారిజాతం అనగానే.. కథ అక్కడ నుండే మొదలు పెట్టాలని జ్యోత్స్న అంటుంది. మీ బావ మాటలో ఎక్కడ అయిన నిన్ను పెళ్లి చేసుకోవడం.. ఇష్టం లేదన్న అనుమానం కన్పించిందా అని పారిజాతం అనగానే.. ఎందుకు అలా అడుగుతున్నావ్? బావ నీతో ఏదైనా చెప్పాడా అని జ్యోత్స్న అడుగగా..‌ అదేం లేదని పారిజాతం అంటుంది.

ఆ తర్వాత శౌర్యని దీప నడిపించుకొని తీసుకొని వస్తుంటే.. అప్పుడే కార్తీక్ వచ్చి శౌర్యని కార్ లో తీసుకొని వెళ్తాడు. మరొక వైపు శోభ నర్సింహలు గొడవపడుతుంటారు. అప్పుడే అనసూయ వచ్చి.. ఎందుకే ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటావని అంటుంది అప్పుడే శోభ వాంథింగ్ చేసుకుంటుంది. ఏంటివి అవేనా అని అనసూయ శోభని అడుగుతుంది.. అవునని శోభ అనగానే.. అనసూయ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను నానమ్మ కాబోతున్నానని అంటుంది. ఆ తర్వాత శోభని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు అప్పుడే దీప ఎదరుపడుతుంది. శోభ ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పగానే దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.