Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : ఆ ప్లాన్ రివీల్ చేసిందెవరు.. అభిని సీతాకాంత్ బయటకు తీసుకొస్తాడా!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -99 లో...  సీతాకాంత్ దగ్గర అభి డబ్బులు తీసుకొని వస్తుంటాడు. సీతాకాంత్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అదంతా శ్రీలత, సందీప్ ఇద్దరు చూస్తుంటారు. ఆ తర్వాత అభి సూటుకేసుతో వెళ్తుంటే పోలీసులు ఆపుతారు. నీ చేతిలో ఏంటి ఓపెన్ చెయ్ అని అడుగుతారు.. ఇవి డబ్బులు నా కష్టార్జితం అని అభి అంటాడు. అవి ఓపెన్ చేసాక దొంగ నోట్లు అని పోలీసులు అంటారు. దాంతో అభి షాక్ అవుతాడు. అప్పుడే సీతాకాంత్ వాళ్ళ ముందు నుండి వెళ్తాంటాడు.

ఆ తర్వాత ఆ డబ్బులు నావి కాదు సర్.. అతనివి అని సీతాకాంత్ ని చూపిస్తాడు. నన్ను ఇంత మోసం చేస్తావా ఇదంతా నీ ప్లాన్ అని అభి అంటాడు. ఎవరు నువ్వు అంటూ సీతాకాంత్ వెళ్ళిపోతాడు.అభిని పోలీసులు తీసుకొని వెళ్తారు. చూసావా సీతాకాంత్ ప్లాన్ ని అంచనా వెయ్యడం.. చాలా కష్టం ఎంత తెలివిగా అభిని లాక్ చేసాడో అని సందీప్ తో శ్రీలత అంటుంది. ఆ తర్వాత అభికి రామలక్ష్మి ఫోన్ చేస్తుంటే స్విచాఫ్ వస్తుంది. దాంతో రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి ఏదో వర్క్ పై ఊటి వెళ్తున్నానని చెప్పాడు.. నువ్వు కంగారుపడకని చెప్తాడు. తినడానికి ఏమైనా తీసుకొని రా అని సీతాకాంత్ అనగానే రామలక్ష్మి వెళ్తుంది. అక్కడ ఏం ఉండవ్.. దాంతో సీతాకాంత్ దోశ రెడీ అని అంటాడు. మాక్కూడా అంటూ సిరి, ధన ఇద్దరు వస్తారు. అలా సీతాకాంత్ దోస చేస్తూ రామలక్ష్మికి వేస్తాడు.

ఆ అభి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వీళ్ళ పెళ్లి నాటకానికి చెక్ పెట్టాలని సందీప్ తో శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఇంటరాగేషన్ పేరుతో అభిని పోలీసులు కొడతారు. అప్పుడే సీతాకాంత్ ఫోన్ చేసి.. ఇంకొకసారి తప్పు చెయ్యాలంటే భయపడేలా చెయ్యండి కానీ కొట్టకండి అని చెప్తాడు.. ఆ తర్వాత శ్రీలత అన్ నోన్ నెంబర్ నుండి రామలక్ష్మికి ఫోన్ చేసి.. అభి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని చెప్తుంది. దాంతో కంగారుగా సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. అభిని పోలీసులు అరెస్ట్ చేశారట అని  చెప్తుంది. దాంతో సీతాకాంత్ షాక్ అవుతాడు. ఎవరు చెప్పారని  అడుగుతాడు. ఎవరో తెలియదు ఫోన్ చేసి చెప్పారని అనగానే అభిని అరెస్ట్ చేసిన విషయం ఎవరికి తెలియదు కదా ఎవరు చెప్పారని సీతాకాంత్ అనుకుంటాడు. ఎవరో కావాలనే చేసి ఉంటారని సీతాకాంత్ అంటాడు. నాకు టెన్షన్ గా ఉంది.. మీకు తెలిసిన పోలీసు వాళ్లలో ఎంక్వయిరీ చెయ్యండని రామలక్ష్మి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో సీతాకాంత్ సరే అంటాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.