English | Telugu

Eto Vellipoyindhi Manasu : ఫేక్ పేపర్స్ తో సీతాకాంత్ అతడిని బురిడి కొట్టించగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -97 లో..సీతాకాంత్ మేనేజర్ సీతాకాంత్ దగ్గరికి వచ్చి.. అభికి రెసాట్ ఇవ్వడానికి చూడమన్నారు కదా అంటూ కొన్ని ఫొటోస్ చూపిస్తాడు. నువ్వు వీటికి సంబంధించి ఫేక్ డాకుమెంట్స్ రెడీ చెయ్ అంతే కాకుండా నువ్వు ఫోన్ చేసి సీతాకాంత్ ఫేక్ డాకుమెంట్స్ ఇచ్చి మోసం చేస్తున్నాడు.. అందుకే డాకుమెంట్స్ కాకుండా డబ్బులు తీసుకోనని అభికి చెప్పమని మేనేజర్ కి సీతాకాంత్ చెప్తాడు. అదేంటీ సర్ ఫేక్ అని తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో.. ఇప్పటికే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అతను అంటాడు.. దానికి సంబంధించిన కంప్లీట్ పిక్చర్ నా దగ్గర ఉంది నేను చెప్పినట్టు చెయ్యమని సీతాకాంత్ చెప్తాడు.

ఆ తర్వాత మేనేజర్ వెళ్ళిపోతాడు. సీతాకాంత్ అభికి ఫోన్ చేసి రెసాట్ ఒకే అయింది. నువ్వు కలిస్తే అన్ని వివరాలు చెప్తానని సీతాకాంత్ అనగానే.. దానికి అభి సరే అంటాడు.. ఆ తర్వాత సందీప్ సీతాకాంత్ వెళ్ళాక రెసాట్ కి సంబంధించిన ఫొటోస్ చూసి ఫోన్ లో తీసుకొని వెళ్లి శ్రీలతకి చెప్తాడు. దానికి సంబంధించినవన్ని తెలుసుకోవాలని శ్రీలత అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ అభిని కలుస్తాడు. రెసట్ నీకు నచ్చిందా అని అడుగుతాడు. బాగుంది అని అభి చెప్తాడు. వాళ్ళు రేపు రెసాట్ గురించి మాట్లాడుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకి డైరెక్ట్ క్యాష్ కావాలని అంటున్నారని సీతాకాంత్ అనగానే.. దానికి అభి సరే అంటాడు... సరే రేపు నేను చెప్పిన ప్లేస్ కి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత రెసాట్ కి సంబంధించి డాకుమెంట్స్ పేపర్స్ తీసుకొని సీతాకాంత్ ఇంటికి వస్తాడు. అవేంటి అని శ్రీలత అడుగుతుంది. నా ఫ్రెండ్ వి అని సీతాకాంత్ అబద్ధం చెప్తాడు. చూసావా అన్నయ్య ఎలా అబద్దం చెప్పాడో అని శ్రీలతతో సందీప్ అంటాడు. రిసార్ట్ కి సంబంధించి గూగుల్ లో సందీప్ సెర్చ్ చేస్తే ఫేక్ అని వస్తుంది. సీతాకాంత్ అభిని మోసం చేయాలని అనుకుంటున్నాడు.. ఇందులో ఏదో ఉంది కనుక్కోవాలని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఆ డాకుమెంట్స్ చూసి.. మీ ఫ్రెండ్ వి అన్నారు మీ వాళ్ళతో అబద్ధం చెప్పారా అని రామలక్ష్మి అనగానే.. బిసినెస్ లో ఇలాంటివి సక్సెస్ అయ్యేవరకు ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పొద్దని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సిరికి గొలుసు తీసుకొని వస్తాడు. కానీ ధనని అవమానించాడని సిరి కోపంగా ఉంటుంది. గొలుసు వద్దని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.