Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : అభి గురించి మొత్తం తెలుసుకున్న సీతాకాంత్.. వాళ్ళని చూసి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -86 లో.. అభి గురించి రామలక్ష్మికి సీతాకాంత్ చెప్పాలని అనుకుంటాడు. అప్పుడే అభి కాల్ చేసి తన గురించి పాజిటివ్ గా చెప్పుకుంటాడు. అలా అభి,  రామలక్ష్మి ఇద్దరు మాట్లాడుకోవడం విని.. ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా అభి గురించి చెప్తే.. నేను కావాలనే అలా చెప్తున్నాననే ఛాన్స్ ఉందని సీతాకాంత్ అనుకుంటాడు. అభితో ఫోన్ మాట్లాడిన తర్వాత.. ఏదో చెప్తానన్నారని రామలక్ష్మి అడుగుతుంది. ఏం లేదంటూ సీతాకాంత్ కవర్ చేస్తాడు.

మరొకవైపు అభి తన ఫ్రెండ్ తో కలిసి డ్రింక్ చేస్తుంటాడు. నువ్వు అసలు సీతాకాంత్ ఇంటికి ఎందుకు వెళ్ళావ్? ఎందుకు రామలక్ష్మికి సారీ చెప్తున్నావని అభిని తన ఫ్రెండ్ అడుగుతాడు. ఎందుకంటే నేను తను లేకుండా ఉండలేనని తను అనుకోవాలి.. మళ్ళీ సారీ ఎందుకు చెప్పానంటే, తను ఏం తప్పు చేయకున్నా మళ్ళీ తనే సారి చెప్పాడని రామలక్ష్మి ఇంకా ఎక్కువ ప్రేమ పెంచుకుంటుంది. అదే నాకు సీతాకాంత్ సర్ దగ్గర డబ్బులు గుంజడానికి పెట్టుబడి అని అభి అంటాడు. అప్పుడే అభికి సందీప్ ఫోన్ చేసి కలిసి మాట్లాడాలన్న కదా అనగానే.. విషయం ఏంటో చెప్పు అని అభి పొగరుగా మాట్లాడుతుంటాటు. అప్పుడే శ్రీలత ఫోన్ తీసుకొని.. వస్తే నీకే లాభం లేదంటే నువ్వే నష్టపోతావని శ్రీలత అనగానే.. సరే లొకేషన్ పంపిస్తాను అక్కడికి రండి అని అభి చెప్తాడు.

మరొకవైపు ఆఫీస్ లో పేపర్స్ కింద పడిపోతుంటే అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్ ఒకేసారి వచ్చి పేపర్స్ తీస్తుంటారు. ఆ సమయంలో ఒకరి తల ఒకరికి తాకూతుంది. అప్పుడే సిరి, ధన ఇద్దరు వస్తారు. అలా ఒకసారి తల తాకితే కొమ్ములు వస్తాయని..  ఇంకోసారి తాకాలని సిరి అనగానే.. వాళ్ళిద్దరు మళ్ళీ తలలు తాకించుకుంటారు. అందరం కలిసి బయటకు వెళదామని సిరి అనగానే.. నాకు వర్క్ ఉందని సీతాకాంత్ అంటాడు... ఆ తర్వాత సిరి, ధన, రామలక్ష్మి, కలిసి ఇంటికి వెళ్తు మధ్యలో ఆగుతారు. అప్పుడే సీతాకాంత్ వెళ్లడం చూసి.. నాకు వర్క్ ఉంది రానని అన్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడని అనుకుంటారు.. ఆ తర్వాత సీతాకాంత్ అభి ఇంటికి వెళ్లి.. వాళ్ళ అమ్మ ద్వారా అన్ని నిజాలు తెలుసుకుంటాడు. మరొకవైపు సందీప్, శ్రీలతలని కలవడానికి అభి వచ్చి.. వీళ్ళు సీతాకాంత్ వాళ్ళ అమ్మ, తమ్ముడు కదా అంటూ వాళ్ళని చూసి అభి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.