English | Telugu
Eto Vellipoyindhi Manasu : జైలు నుండి బయటకు తీసుకొచ్చింది మా అన్నయ్యే.. షాక్ లో శ్రీలత!
Updated : Jan 31, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -316 లో.... సందీప్ ధన ఇద్దరు బయటకుకి వస్తారు. నేను చేసిన ప్రయత్నం ఫలించిందని రాజీవ్ అంటాడు. అంటే మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చింది మీరా అని సందీప్ అంటాడు. అవునని చెప్పగానే రాజీవ్ కి ఇద్దరు థాంక్స్ చెప్తారు. సరే మళ్ళీ కలుద్దామంటూ రాజీవ్ వెళ్ళిపోతాడు. ధన, సందీప్ లు ఆటో కోసం చూస్తుంటే అప్పుడే రామలక్ష్మి వస్తుంది. వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఏంటి వీళ్ళు బయటకు వచ్చారని అనుకుంటుంది. వెళదాం పదా మనలాంటి వాళ్ళు డబ్బు ఇస్తేనే కదా వాళ్ళ కడుపు నిండేది అని ధనతో సందీప్ అంటాడు. ఇద్దరు రామలక్ష్మి ఆటో ఎక్కుతారు.
మేము ఏం తప్పు చెయ్యలేదు అందుకే బయటకు వచ్చాము.. మమ్మల్ని మీరు తప్పుగా అపార్ధం చేసుకున్నారని రామలక్ష్మితో ధన అంటాడు. ఇల్లు రాగానే రామలక్ష్మి సడెన్ గా బ్రేక్ వేస్తుంది. ఏంటి అంటూ సందీప్ అనగానే.. మీ కొంప వచ్చిందని రామలక్ష్మి అంటుంది. డబ్బులు ఇవ్వండి అని రామలక్ష్మి అనగానే.. వాళ్ళ దగ్గర ఉండవు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి రాగానే వాళ్ళని బయటకు తీసుకొని వచ్చింది మీరే కదా అని సీతాకాంత్ పై రామలక్ష్మి విరుచుకుపడుతుంది. మరేం చేయమంటావ్ నా చెల్లి తన భర్తని విడిపించమని రిక్వెస్ట్ చేసిందని సీతాకాంత్ అంటాడు. వాళ్ళు మారరని.. సీతాకాంత్ కి ఏదయినా హాని తలపెడతారోనని రామలక్ష్మి భయపడుతుంది.
ధన, సందీప్, శ్రీలత, రాజీవ్, శ్రీవల్లి లు మాట్లాడుకుంటారు. ఆ రామలక్ష్మి, సీతకాంత్ లకి టార్చర్ చూపించాలని సందీప్ అనగానే సిరి వచ్చి.. సందీప్ చెంప చెల్లుమనిపిస్తుంది. అన్నయ్య వదిన గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చింది అన్నయ్యనే అని సిరి అనగానే.. నీకు ఎలా తెలుసని శ్రీలత అంటుంది. నాకు తెలుసని సిరి అంటుంది. అది నిజమేనా అని రాజీవ్ ని శ్రీలత అడుగగా.. అవునని రాజీవ్ తల ఊపుతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఇప్పటికైనా అర్థమైందా అని సిరి వాళ్లకి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.