English | Telugu
Karthika deepam2 : కోలుకున్న దాస్.. దీప, కార్తీక్ ల బంధం ఇదే!
Updated : Jan 31, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -269 లో.... దీప దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. నీ కూతురిని కాపాడతాను.. నా బావని నాకు ఇచ్చేయమంటూ ఢీల్ పెడుతుంది. ఈ పేపర్స్ పై సంతకం చెయ్.. నీకు బావకి సంబంధం లేదని దీపని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ డబ్బు కోసం చేస్తున్న ప్రయత్నాలు దీప గుర్తు చేసుకుంటుంది.. అంత డబ్బు మీరు ఏర్పాటు చెయ్యలేరు.. నేనే ఇప్పుడు నీ పాలిట దేవతని అని దీపని జ్యోత్స్న బలవంతపెడుతుంది.
అప్పుడే కార్తీక్ వస్తాడు. దూరంగా ఉండి అంత చూస్తూ ఉంటాడు. దీప చెయ్ బలవంతంగా పట్టుకొని సంతకం చెయ్ అంటుంది జ్యోత్స్న. దాంతో దీప చెయ్ నెట్టేసి పేపర్స్ చింపేస్తుంది. నువ్వు కార్తీక్ బాబుకి వెల కట్టావ్.. నేను గుడి కట్టానే అని జ్యోత్స్న పై దీప విరుచుకుపడుతుంది. కార్తీక్ గురించి దీప గొప్పగా చెప్తుంటే కార్తీక్ చూసి గర్వంగా ఫీల్ అవుతాడు. అప్పుడే కార్తీక్ ని చూసిన దీప.. చుడండి బాబు మీరు కావాలంటుంది.. మీకు తనతో ఉండడం ఇష్టమా అని దీప అడుగుతుంది. నా గురించి నీకు తెలుసు కదా అని కార్తీక్ అంటాడు. నాకు తనని అనాలన్నంత కోపం వస్తుంది. కానీ నీ సమాధానం వినాలని ఆగిన అని దీపకి సపోర్ట్ గా కార్తీక్ మాట్లాడతాడు. దీప మంచిగా సమాధానం చెప్పింది. ఇప్పుడు నువ్వు వెళ్ళు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు.
నువ్వు మనసు మార్చుకుంటే ఫోన్ చెయ్.. నా ఫోన్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటుందని దీపకి జ్యోత్స్న చెప్పి వెళ్తుంది. మరొకవైపు దాస్ ఇంట్లో నుండి బయటకు వస్తాడు. అప్పుడే కాశీ వచ్చి లోపలికి తీసుకొని వచ్చి పడుకోపెడతాడు. అక్కడ ఒక పేపర్ దొరుకుతుంది. అందులో మోసం.. తప్పు.. కొట్టారు.. వదలను అనే పదాలు రాసి ఉంటాయి. ఏంటి ఇలా రాసాడని స్వప్నతో కాశీ అనగానే.. తను ఏదో పేపర్ లో రాసాడులే అని లైట్ తీసుకుంటుంది కానీ కాశీ ఆలోచనలో పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.