English | Telugu

Eto Vellipoyindhi Manasu : భర్తని కొంగున కట్టేసుకున్న భార్య.. అత్త చూసి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -186 లో......రామలక్ష్మి నందినికి ఫోన్ చేసి అందరం కలిసి భోజనం చేద్దాం రమ్మని అంటుంది. దాంతో నందిని ఒకేసారి అని భోజనానికి వస్తుంది. అప్పుడే రామలక్ష్మి వాటర్ ఉండడంతో జారీ పడిపోతుంటే అప్పుడే సీతాకాంత్ పట్టుకుంటాడు. అప్పుడే నందిని వచ్చి.. వాళ్ళను చూస్తుంది. మీ మధ్యలో నేనేందుకని నందిని అంటుంది. మీరు మా వాళ్ళే అంటూ ముగ్గురికి రామలక్ష్మి భోజనం వడ్డీస్తుంది. సీతా వాలకం చూస్తుంటే రామలక్ష్మి అంటే ఇష్టం లేనట్లుంది అందుకే కదా నేను నా ప్రేమతో దగ్గర అవ్వాలనుకుంటున్నానని నందిని అనుకుంటుంది.

ఆ తర్వాత రామలక్ష్మి ప్లేస్ లో నందిని ఉన్నట్లు ఊహించుకుంటుంది. మరొకవైపు ఉప్పు ఎక్కువున్న వంటలన్ని శ్రీవల్లి, శ్రీలతలు వడ్డించుకుంటారు. ఈ రోజు సీతా బావ రామలక్ష్మిపై కోపడ్డే పని చేసానని శ్రీవల్లి అనగానే.. ఏంటని శ్రీలత అడుగుతుంది. తను తీసుకొని వెళ్లే బాక్స్‌లో ఉప్పు కారం కలిపిన అనగానే మంచి పని చేసావని శ్రీలత మెచ్చుకుంటుంది. ఆ తర్వాత శ్రీలత ఉప్పు కారం ఎక్కువున్నా భోజనం తిని ఇలా చేసావ్ ఏంటని కోప్పడుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఎక్కడికైనా బయటకు వెళదామని సీతాకాంత్ తో అనగానే తన ప్రేమ విషయం చెప్తుందని సరే అని అంటాడు. అప్పుడే నందినిని రామలక్ష్మి చూసి.. ఏంటి ఇక్కడున్నారని అడుగుతుంది. కార్ ట్రబుల్ ఇచ్చిందని నందిని అంటుంది. క్యాబ్ బుక్ చేస్తానని సీతాకాంత్ అనగానే.. వద్దు మనమే డ్రాప్ చేద్దామని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ముగ్గురు కార్ లో వెళ్తారు.

ఆ తర్వాత ఇక్కడ వరకు వచ్చారు ఇంట్లోకి రండి అనగానే సీతాకాంత్ వద్దని అంటున్నా, రామలక్ష్మి వెళదామని అంటుంది. ఇంట్లోకి వెళ్లి రామలక్ష్మి ఇల్లు చూస్తుంటే.. సీతాకాంత్, నందినిలు ఇద్దరు‌ కలిసి దిగిన ఫోటో చూస్తుందేమోనని, ఆ ఫోటో ఉన్నా రూమ్ లోకి వెళ్తుంటే నందిని వద్దని చెప్తుంది. కానీ సీతాకాంత్ ఆ ఫోటో చూస్తాడు. ఆ తర్వాత కాఫీ తాగి అక్కడ నుండి వెళ్తారు. సీతా ఆ ఫోటో చూసి ఉంటే నన్ను తప్పుగా అర్థం చేసుకొనే వాడు అని నందిని అనుకుంటుంది. మరొకవైపు రామలక్ష్మి శ్రీలతతో.. నా భర్తని నా కొంగున కట్టేసుకుంటా అని విషయం గుర్తుచేసుకుని రామలక్ష్మి కార్ దిగగానే.. ఒక పని చెయ్యండి అంటు చెప్తుంది. తన కొంగుకి సీతాకాంత్ ని ముడివేసుకొని ఇంట్లోకి వెళ్తుంది. అలా వెళ్లడంతో శ్రీలత, శ్రీవల్లి ఇద్దరు షాక్ అవుతారు. ఇదేదో బాగుందని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.