English | Telugu
Eto Vellipoyindhi Manasu : భర్త కోసం ప్రేమగా వండి తీసుకొచ్చిన భార్య.. ఆమెతో అలా!
Updated : Aug 27, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -185 లో.....నందిని సీతాకాంత్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఏంటి అలా చూస్తున్నావ్ పార్టనర్.. మనుషులని మనసులని బాగా స్టడీ చేసిన దాన్ని.. ఇక నుండి మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి.. గతాన్ని కాదు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటేనే మనం ముందుకి వెళ్ళగలుగుతాం.. అప్పుడే కంపెనీ సక్సెస్ అవుతుందని నందిని అంటుంది. ఆ తర్వాత మేనేజర్ వచ్చి ఫైల్ పై సంతకం పెట్టమంటాడు. నందిని మేడమ్ కూడ పెట్టాలని మేనేజర్ అంటాడు. దాంతో నందిని కూడా సంతకం పెడుతుంది. ఇద్దరి సంతకలు పక్కపక్కన ఉండడం చూసి నందిని హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు సీతాకాంత్ కి నచ్చిన వంటలు చేసి క్యారెజ్ తీసుకొని వెళ్ళాలని రామలక్ష్మి కిచెన్ లో వంట చేస్తుంది. అదంతా శ్రీవల్లి చూసి.. రాత్రి జరిగింది మర్చిపోయి ప్రేమగా వంట చేస్తున్నావా.. చెప్తానని శ్రీవల్లి అనుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వంట పూర్తి చేసి వెళ్తుంది. శ్రీవల్లి వచ్చి వాళ్ళకి వేరే గిన్నెలో వండినివి తీసుకొని.. మిగతా వాటిలో ఉప్పు వేస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి వస్తుంది. ఏంటి ఇక్కడ ఉన్నావని అడుగగా జ్యూస్ కోసం వచ్చానని చెప్పి వెళ్ళిపోతుంది. రామలక్ష్మికి డౌట్ వచ్చి కర్రీ టేస్ట్ చూస్తుంది. ఉప్పుగా ఉండడంతో తను తీసుకున్న కర్రీని సీతాకాంత్ కి బాక్స్ కట్టి.. ఉప్పు ఉన్న వాటిని అక్కడ పెడుతుంది. ఆ తర్వాత క్యారేజ్ తీసుకొని రామలక్ష్మి వెళ్తుంటే.. రాత్రి జరిగింది మర్చిపోయి వెళ్తున్నావా అంటూ శ్రీలత మాట్లాడుతుంది. దానికి తగ్గ కౌంటర్ వేసి రామలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
మరొకవైపు సందీప్ పర్మిషన్ అడగకుండా నందిని క్యాబిన్ కి వెళ్తాడు. దాంతో నందిని తనపై కోప్పడుతుంది. మేడమ్ నేను చెప్పింది ఒకే అన్నారు.. అలా చేశారని సందీప్ అనగానే.. ఏం చెయ్యాలో నాకు తెలుసు.. చేసేవరకు చూస్తా ఉండమని రూడ్ గా మాట్లాడుతుంది. దాంతో సరేనని సందీప్ వెళ్ళిపోతాడు. మరొకవైపు సీతాకాంత్ క్యారేజ్ తీసుకొని రామలక్ష్మి ఆఫీస్ కి వస్తుంది. నందిని కూడా ఆఫీస్ లో ఉందని తెలిసి.. తనకు ఫోన్ చేసి క్యారేజ్ తెచ్చాను.. ముగ్గురం కలిసి భోజనం చేద్దామని అంటుంది. దానికి నందిని సరే అంటుంది. మన మధ్యలో తనేందుకని సీతాకంత్ అంటాడు. తను మనకి చాలా హెల్ప్ చేసిందని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.