English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్యాభర్తలుగా నటిస్తున్నారని తెలుసుకున్న పెద్దాయన.. ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -110 లో.. మీరు పిలవడం ఎందుకు అవమానించడం ఎందుకని ధన అంటాడు. బుద్ది లేక... అది లేకే నువ్వు ఈ ఇంటికి అల్లుడు అయ్యావని శ్రీలత అంటుంది. ఆ రామలక్ష్మితో దీపం వెలిగిస్తే నేను చచ్చినంత ఒట్టేనని సీతాకాంత్ కి శ్రీలత చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి శ్రీలత అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంది. అప్పుడే ధన వస్తాడు. చూసావ్ కదా ఎలా మాట్లాడుతుందో.. పైకి మనతో ఎలా మాట్లాడుతుంది.. లోపల మనపై ఎంత కోపం ఉందో చూసావ్ కదా అని సీరియస్ అవుతాడు.

జరిగిందేదో జరిగింది వదిలేయమని రామలక్ష్మి అంటుంది. అయిన మనం ఏం తప్పు చేసాం.. ఆవిడా మనతో ప్రేమగా ఉండడమనేది అబద్దం‌. ఇదే నిజం.. టైమ్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంది. ఇప్పుడు తన నిజస్వరూపం తెలిసిందని ధన అంటాడు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. జరిగిన దానికి మీరు బాధపడుతున్నారని అర్థమైంది. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ ఆవిడకి బాధలో అలా మాట్లాడిందని.. అవేం తప్పుగా అనుకోకండని సీతాకాంత్ అంటాడు. మా నాన్న తినే ప్లేట్ విసిరేసారు.. ఆఫీస్ లో అటెండర్ జాబ్ ఇచ్చి అవమానించారని ధన కోపంగా అనేసి వెళ్ళిపోతాడు. వాడు కోపంగా ఉన్నాడు.. వాడికి అర్థం అయ్యేలా చెప్తానని సీతాకాంత్ తో రామలక్ష్మి అంటుంది. నువ్వు నన్ను అర్థం చేసుకోవనుకున్నాను కానీ చేసుకున్నావని సీతాకాంత్ అనుకుంటాడు.

మరొకవైపు పెద్దాయన ఫైల్స్ చూస్తుంటే.. అందులో రామలక్ష్మి, సీతాకాంత్ ల అగ్రిమెంట్ చూస్తాడు. అందులో రామలక్ష్మి, సీతాకాంత్ లు భార్యాభర్తలుగా నటిస్తున్నట్లు ఉంటుంది. అది చూసి పెద్దాయన షాక్ అవుతాడు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్లి.. నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి.. ఢిల్లీకి వెళ్లి అక్కడ కోచింగ్ తీసుకుంటానని రామలక్ష్మి అనగానే.. నీ నిర్ణయానికి ఎప్పుడు అడ్డు చెప్పనని సీతాకాంత్ అంటాడు. అదంతా పైనుండి పెద్దాయన వింటాడు. ఆ తర్వాత భోజనం చెయ్యడానికి శ్రీలత రాలేదని సీతాకాంత్ వెళ్లి పిలుస్తాడు. అయిన శ్రీలత రాదు.. ఆ తర్వాత రామలక్ష్మి వెళ్లి తీసుకొని వస్తుంది. నా కోడలు పిలిచినా రాకుంటే నాకు కష్టంగా ఉంటుంది.. అందుకే వచ్చానని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.