English | Telugu
'కార్తీకదీపం' హిమ ఇంటికి ఈటల ఎందుకు వచ్చారు?!
Updated : Jul 2, 2021
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ టాపిక్ వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా సోషల్ మీడియాలో 'కార్తీకదీపం' హిమ తెగ హల్చల్ చేస్తోంది. మాములుగా 'కార్తీకదీపం' సీరియల్ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. రీసెంట్ గా 'ఆర్ఆర్ఆర్' పోస్టర్‌ను సైతం 'కార్తీకదీపం' స్టైల్ లోకి మార్చి మీమ్స్ క్రియేట్ చేశారు. ఈ సీరియల్ మాత్రమే కాదు.. అందులో నటీనటులు కూడా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు.
ముఖ్యంగా చిన్నపిల్లల పాత్రలు పోషిస్తున్న హిమ (సహృద), శౌర్య (కృతిక) సోషల్ మీడియాలో చేసే అల్లరి మాములుగా ఉండదు. సహృద ఈ మధ్యకాలంలో తన డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. మాస్ స్టెప్పులతో తన ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా సహృద.. తెలంగాణా మాజీ మినిస్టర్, ఇటీవలే బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌తో కలిసి తీసుకున్న ఫోటోని షేర్ చేసింది.
అసలు ఇప్పుడు తెలంగాణలో ఈటల రాజేందర్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సహృద ఆయనతో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఈటల రాజేందర్ తన ఇంటికి వచ్చినట్లు చెప్పింది సహృద. కానీ ఎందుకు వచ్చారనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. ఇదే అంశంపై నెటిజన్లు ఆమెని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.